నేటి సాక్షి (భూమయ్య)కౌడిపల్లి మండలం రాయిలాపూర్ వరి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ సందర్శించారు.కౌడిపల్లి మండలం రాయిలాపూర్ గ్రామం లో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాసిల్దార్ తో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించి కేంద్రంలో జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించారు. రైతులకు పారదర్శకంగా, నష్టాలు లేకుండా ధాన్యం కొనుగోలు చేసే విధానంపై సూచనలు సలహాలు అందించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూరాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో వరి సేకరణ ప్రక్రియ కీలక భూమిక పోషిస్తోంది. అని వివరించారుజిల్లాలో ధాన్యం కొనుగోలు వేగంగా జరుగుతున్నాయన్నారు.గత సంవత్సరం ఇదే నెలలో 16,060 మంది రైతుల నుంచి 90.728 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ 56.12 కోట్ల చెల్లించగా…ప్రస్తుత సీజన్ కి… ఇప్పటివరకు 37,117 మంది రైతుల నుండి 1.40 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ 186.40 కోట్ల చెల్లింపులు జరిగాయన్నారు. గతంలో కంటే మెరుగ్గా ధాన్యం కొనుగోలు జరుగుతుండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు తెచ్చిన వడ్లను ప్యాడి క్లీనర్ ద్వారా శుద్ధి చేసి తూకం వేయడం జరుగుతోందని, ఈ విధానం వల్ల ధాన్యంలో ఉన్న ధూళి, ఇతర అశుద్ధ పదార్థాలు తొలగిపోయి రైతులకు తూకం నష్టాలు గణనీయంగా తగ్గుతున్నాయని కలెక్టర్ తెలిపారు.ఇప్పటి వరకు 37,117 మంది రైతుల నుండి మొత్తం1.40 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి సేకరించిన ధాన్యాన్ని లారీల ద్వారా రైస్ మిల్లులకు పంపినట్లు ధాన్య రుసుములు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు.ప్యాడి క్లీనర్ ద్వారా శుద్ధి చేయడం వల్ల రైతులకు ప్రతీ క్వింటాలు పై 1 కిలో 500 గ్రాముల వరకు ఆదా అవుతుందని అన్నారు.ఈ సందర్భంగా ఈ విధానం అత్యంత ప్రయోజనకరమని పేర్కొని, ప్రతి రైతు తప్పనిసరిగా (ప్యాడి క్లీనర్ వినియోగం) చేయాలని సూచించారు.పాడి క్లీనర్ ద్వారా శుద్ధి చేసేందుకు రైతులు మరింత ముందుకు రావాలని కోరారు.ప్రభుత్వ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా శుభ్రమైన ధాన్యం అందుబాటు వంటి ప్రయోజనాలు లభిస్తున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు





