నేటి సాక్షి 21 మార్చి పాములపాడు:-పాములపాడు మండలంలోని, భానుముక్కల గ్రామానికి చెందిన ప్రజాశక్తి విలేకరిగా గత పది సంవత్సరాలుగా పనిచేసే ప్రస్తుతం వార్త రిపోర్టర్ గా పనిచేస్తున్న చంద్రయ్య తల్లి మరియమ్మ{86} శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు సమయంలో మృతి చెందారన్నా విషయం తెలుసుకున్న సిపిఎం మండల కార్యదర్శి డీ.స్వామన్న, సిఐటియు జిల్లా నాయకులు మేకల రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఏసేపు లు ఆమె పార్థివ దేహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తపరిచారు. మరియమ్మ నలుగురు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారన్నారు. ఆమె ఎంతో శాంత హృదయముతో మరియు ప్రేమ మూర్తి ఇతరుల పట్ల ఆప్యాయతంగా వ్యవహరించేవారని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.





