Saturday, March 7, 2026

*పాములపాడులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఏపీఓ- బి.జయంతి*. *.

నేటి సాక్షి 06 మార్చి పాములపాడు:- మండల కేంద్రమైన పాములపాడులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఏపీఓ- బి.జయంతి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీవో- బి.జయంతి ఉపాధి పనులు చేసే శ్రామికుల మాస్టర్లను వెరిఫికేషన్ చేయడం జరిగింది. పేదలు పనుల కోసం ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వలసలు పోకుండా నివారించడానికి, పనుల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ ఉపాధి హామీ పని కల్పించడం జరుగుతుందన్నారు. వికసిత్ భారత్ జి రామ్ జి ఉపాధి హామీ పథకం మార్పులో శ్రామికులకు ఒక కుటుంబానికి 125 రోజుల పని కల్పించడం జరుగుతుందన్నారు. ఇది గ్రామీణాభివృద్ధికి నూతన సంకల్పం ఉపాధికి కొత్త హామీ అని అన్నారు. ఉపాధి పని కల్పించని ఎడల నిరుద్యోగ భృతి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. శ్రామికులకు సమయానికి కూలి చెల్లింపులు ఉంటాయన్నారు. ఇందులో కూడా ఆలస్యమైన చెల్లింపులకు పరిహారం కూడా ఉంటుందన్నారు. గ్రామ సభ ద్వారా వికసిత్ గ్రామపంచాయతీ పనుల ప్రణాళిక రూపొందించడం జరుగుతుందన్నారు. ఇందులో శ్రామికుల ఫేస్ యాప్ ఫోటో, చేసే పనుల ఫోటో కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పంపడం జరుగుతుందన్నారు. ఉపాధి కూలీలు తమ కొలతల ప్రకారం పనిచేస్తే మంచి కూలి పడుతుందన్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో కొంత ఇబ్బంది శ్రామికులకు ఉన్న భవిష్యత్తులో పరిష్కారమయ్యే మార్గం ఉందన్నారు. ఎందుకంటే మన గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సరిగా లేకపోవడంతో ఫేస్ యాప్, మిగతా వాటి కోసం పనుల దగ్గర తీవ్ర ఆలస్యం జరుగుతున్నదని శ్రామికులు మాకు చెప్పడం జరిగిందన్నారు. మేము కూడా శ్రామికుల సమస్యలను మా అధికారులకు తెలియజేసి వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాములపాడు ఫీల్డ్ అసిస్టెంట్ జూపల్లె.లింగస్వామి, మేట్ కలబండి.నాగరాజు, ఉపాధి హామీ కూలీలు పాల్గొనడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News