Monday, March 9, 2026

పాములపాడులో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు సర్వర్ కష్టాలు . ఎంపిడిఓ కార్యాలయం ముట్టడించిన ఉపాధి హామీ కార్మికులు …ఎంపిడిఓ కు వినతిపత్రం అందించిన ప్రజా సంఘాల నాయకులు

నేటి సాక్షి 09 మార్చి పాములపాడు:- పాములపాడు మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులను ప్రజలకు కల్పించడమైనది. అయితే ఉపాధి హామీ కూలీల అటెండెన్స్ విషయమై ఉపాధి శ్రామికులు ఎంపిడిఓ కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేశారు.ఈ విషయము పై సోషల్ వర్కర్ కలబండి.నాగరాజు, మాలమహానాడు అంకన్న మాట్లాడుతూ అయితే గతంలో ఏర్పాటు చేసిన అటెండెన్స్ గ్రూప్ ఫోటో ద్వారా చాలా బాగా ఉండేది.ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫేస్ యాప్ ద్వారా తీసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు గ్రామీణ ప్రాంతాల్లో నెట్ వర్క్ సమస్య చాలా ఉన్నది. కొంతమందికి అటెండెన్స్ కూలీలకు ఫేస్ యాప్ ద్వారా హాజరు సర్వర్ ప్రాబ్లం వలన హాజరు పడకపోవడం మరియు కొంతమందికి గడ్డాలు, పెరిగిన కానీ మొహం సరిగా తీసుకోకపోవడం ఇలా సర్వర్ వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఉదయం పోటో నే పడటం లేదు మరీ రెండవ ఫోటో మండుటెండలో 3 కు ఫోటో దిగాలి అంటే ఈ పద్ధతి వలన మున్ముందు రోజుల్లో తీవ్ర ఎండలో చేయలేరు పని చేసిన వేతనం రావడం కష్టం అవుతుంది.కాబట్టి ప్రభుత్వం దృష్టి కి తీసుకురావడం ఏమిటంటే మాకు ఉపాధి కూలీలకు పాత పద్ధతినే ఏమిటంటే గ్రూప్ ఫోటో అయిన లేకుంటే థంబ్ సిస్టమ్ అయినా కొనసాగించాలని పాములపాడు ఎంపిడిఓ చంద్రశేఖర్ దృష్టి కి తీసుకొని రావడం జరిగిన్నారు.ఎంపిడిఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ విషయంపై ఉపాధి హామీ పీడీ కి. మీరు కోరిన విధంగా మీ సమస్యను ఉన్నత అధికారులకు లెటర్ పంపిస్తాము అని చెప్పడం జరిగింది. ఏపీఓ బి.జయంతి మాట్లాడుతూ ఈ విషయంపై మా పై ఉన్నతాధికారులకు లెటర్ పంపిస్తాము తదుపరి ప్రాబ్లం మీకు ఏ ఇబ్బందులు ఉండకూడదనే మేముకూడ సాధ్యమైనంతవరకు చూస్తాము అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు లింగాల నాగరాజు పాములపాడు ఫీల్డ్ అసిస్టెంట్ జూపల్లె.లింగస్వామి, మరియు , ఉపాధి హామీ కూలీలు పాల్గొనడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News