నేటి సాక్షి 08 జనవరి పాములపాడు:—మండల కేంద్రమైన పాములపాడులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మండల స్థాయి సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు బిజెపి మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ పత్రిక ముఖంగా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరం నుంచి సంక్రాంతి కి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని, మండల కేంద్రమైన పాములపాడు లో శ్రీ చౌడేశ్వరి దేవాలయం ఆవరణంలో ఈనెల 13వ తేదీన ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి పోటీలు ప్రారంభమవుతాయి. విజేత బహుమతులు పట్టు చీరలు, చీరలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనే ప్రతి మహిళలకు “గిఫ్ట్ బహుమతులు” అందజేస్తామని తెలిపారు. కావున ఈ పోటీలో పాల్గొనే మహిళలు తమ పేర్లను 8686672818 కు కాల్ చేసి తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా తెలిపారు.

