నేటి సాక్షి 25 పాములపాడు :–నంద్యాల జిల్లా, పాములపాడు మండలంలోని హిందూ సమ్మేళనం కార్యక్రమం విజయవంతం అయింది. ఈ కార్యక్రమంలో విశిష్ఠ అతిదులు గౌరవనీయులు విరజానంద స్వామీజీ వారు పాల్గొన్నారు. పాములపాడు మండల హిందువులంతా జనార్దన్ రైస్ మిల్ వద్దా స్వామీజీని ఆహ్వానం పలికారు. అక్కడి నుంచి పూలు చల్లుకుంటూ మంగళ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా ఆహ్వానం పలుకుతూ శ్రీ చౌడేశ్వరి దేవాలయం వద్దకు తీసుకువెళ్లడం జరిగింది. అనంతరం స్వామీజీ దేవాలయంలోకి వెళ్లి శ్రీ చౌడేశ్వరి దేవి దర్శనం చేసుకొని భరతమాత విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రద్యులైన చేశారు. అనంతరం స్టేజిపై వివిధ రకాల నృత్య కళలను విద్యార్థులు ప్రదర్శించారు. అనంతరం శ్రీశ్రీ విరజానంద స్వామీజీ వారు మాట్లాడుతూ స్వశక్త హిందూ స్వాభిమాన్ నిర్మాణం కోసం మరియు ప్రతి హిందువులో ఆత్మ విశ్వాసాన్ని నింపడం కోసం RSS అనేక సంవత్సరాల నుంచి నిరంతరం శ్రమిస్తూ హిందూ సమాజాన్ని జాగృతం చేస్తూ, ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భావాలను నిర్మాణము చేస్తూ నేడు 100వ సంవత్సరములోకి అడుగు పెడుతున్న సందర్భముగా కృష్ణానగర్ గ్రామంలో హిందూ సమ్మేళనాన్ని నిర్వహించింది. ప్రతి హిందువులలో ఆత్మ విశ్వాసాన్ని నింపడం కోసం మన గ్రామాలలో మరియు బస్తీలలో హిందుత్వ వాతావరణం నిర్మాణం చేయడం, మత మార్పిడులకు అడ్డుకట్ట వేయడం, మనమంతా హిందువులం, కులం మన ఇంటి వరకే పరిమితం. గడప దాటితే మనమంతా హిందువులం అనే భావన నిర్మాణం చేయయడం, మన దేవాలయ వ్యవస్థను కాపాడుకోవడం, సమాజంలో సామాజిక సమరసతను నిర్మాణం చేయడం, కుటుంబ వ్యవస్థ బలోపేతం చేసుకోవడం మనందరి బాధ్యత. ఇదే ఈ హిందూ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ కార్యక్రమంలో పలువురు హిందూ ప్రముఖులు, ఆర్ఎస్ఎస్,, హిందూ సమ్మేళన నిర్వాహకులు, బిజెపి రాయపాటి మురళీమోహన్, జయ సింహా రెడ్డి, టి ఎన్ ఆర్ నాగరాజు , రాజేష్ , రాయపాటి గోవిందు, నర్సపేట రామకృష్ణ, అపర్ణ దీపిక, జూటూరు రమేష్ ఆచారి, సత్యమయ్య, సాయి కృష్ణ, కురువ పుల్లయ్య నాని రామస్వామి, వివిధ గ్రామాల హిందువులు పాల్గొన్నారూ.





