నేటి సాక్షి 24 ఫిబ్రవరి పాములపాడు:-మండల కేంద్రమైన పాములపాడు మమతా క్లినిక్ ఆర్ఎంపీ వైద్యులు-మద్దూరు.రాజు, మద్దూరు రాధమ్మల కుమార్తె ఎం.మమత(ఎంబీబీఎస్), కుమారుడు ఎం.రాజేష్(బిహెచ్ ఎంఎస్ & సిసీఎం) లు డాక్టర్లుగా పట్టాలు పొందడం జరిగింది. ఈ సందర్భంగా మమతా క్లినిక్ వైద్యులు ఎం.రాజు మాట్లాడుతూ కుమార్తె ఎం.మమత ను నంద్యాల శాంతిరాం హాస్పిటల్ లో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా నా కుమారుడు ఎం.రాజేష్ బెంగళూరులోని, భగవాన్ బుద్ధ హోమియోపతి కళాశాలలో బిహెచ్ఎంఎస్ కోర్సును, మరియు కర్నూలులోని, అమీలియా హాస్పిటల్లో (సిసిఎం) క్రిటికల్ కేర్ మెడిసిన్ కోర్సులను పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. నా కుమార్తె, కుమారుడు లను నూతన డాక్టర్లుగా ప్రజలకు సేవ చేయడానికి మీ ముందుకు పంపిస్తున్నానని, వారిని మీరందరూ ఆదరించాలని పేరుపేరునా అందర్నీ కోరారు. కష్టపడి చదువుకొని నూతన డాక్టర్లుగా పట్టాలు పొందిన మద్దూరు మమత, మద్దూరు రాజేష్ లకు అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైద్యులు, సామాజికవేత్తలు, సోషల్ మీడియా ప్రతినిధులు, సమాజసేవకులు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.





