Thursday, March 19, 2026

పాములపాడు ఎర్రగూడూరు హైవే సమీపంలో బైకును ఢీకొన్న కారు -వ్యక్తికి గాయాలు

నేటి సాక్షి 12 పాములపాడు :—పాములపాడు :మండలంలోని ఎర్రగుడూరు గ్రామం సమీపంలో శుక్రవారం నేషనల్ హైవేపై కారు బైక్ ను ఢీకొన్న సంఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల విరాల మేరకు మండలంలోని భానుముక్కల గ్రామం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు జనార్దన్ రెడ్డి, బలరాములు ఏపీ 39 కే హెచ్ 2480 కారులో కర్నూల్ వెళ్తుండగా ఎర్రగోడూరు గ్రామానికి చెందిన హరి అనే అనే వ్యక్తి ఏపీ 21 బి యు 8 7 2 6 నెంబర్ గల బైక్ యూ టర్న్ వద్ద క్రాస్ చేస్తుండగా కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో హరికి తీవ్ర గాయాలు కాగా కారు రోడ్డు ప్రక్క గొయ్యిలో పడింది. తీవ్రగాల గాయాలైన హరిని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న హెడ్ కానిస్టేబుల్ రమణ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News