నేటి సాక్షి 02 పాములపాడు:- పాములపాడు ఎస్సై-పి.తిరుపాలు కు మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.అంకన్న, మండల కో ఆఫ్టేడ్ మెంబర్ సయ్యద్.ముర్తుజాఅలీ, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్.షేక్షాఅలీ, సోషల్ మీడియా ప్రతినిధులు డక్కా.శ్రీకాంత్, షేక్. మహబూబ్ బాష, గోవిందు లు స్వీట్లు, పండ్లు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భముగా ప్రజాసంఘాల నాయకులు మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కె.అంకన్న, మండల కో ఆఫ్టెడ్ మెంబర్ సయ్యద్.ముర్తుజాఅలీ, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్.షేక్షాఅలీ, సోషల్ మీడియా ప్రతినిధులు డక్కా.శ్రీకాంత్, గోవిందు, షేక్.మహబూబ్ బాష లు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం-2026 లో, మరియు భవిష్యత్తులో ఎస్సై- పి.తిరుపాలు పర్యవేక్షణలో మండల ప్రజలందరూ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా, వర్గ బేధాలకు పోకుండా, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, మంచి పౌరులుగా రాజకీయాలకు అతీతంగా, కుల మతాల అతీతంగా స్నేహపూర్వకంగా మానవత్వంతో, సుఖ సంతోషాలతో అందరూ కలిసిమెలిసి జీవించాలని అందులో మేమందరం కూడా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ, ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మండల ప్రజలందరికీ మరియు రాష్ట్ర ప్రజలందరికీ పేరుపేరునా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

