నేటి (సాక్షి):పాములపాడు ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాలలో 2026–2027 విద్యా సంవత్సరానికి జూనియర్ ఇంటర్మీడియట్ (1వ సంవత్సరం) ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రిన్సిపాల్ శ్రీ నాగ రవీంద్ర తెలిపారు.వివరాల్లోకి వెళ్తే, ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సుల్లో ప్రతి కోర్సుకు 40 సీట్లు చొప్పున మొత్తం 160 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 20-03-2026చివరి తేదీ: 30-04-2026అంతేకాకుండా, ఈ విద్యాసంస్థలో చక్కటి వాతావరణం, సౌకర్యవంతమైన తరగతి గదులు, విశాలమైన క్రీడా మైదానం, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యాబోధన అందించబడుతుందని తెలిపారు. మోడల్ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులు ప్రతిభతో ఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ప్రవేశాలు పొందుతున్నారని ప్రిన్సిపాల్ నాగ రవీంద్ర పేర్కొన్నారు.అర్హులైన విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.





