నేటి సాక్షి 04 మార్చి పాములపాడు:–నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశాల మేరకు ఆత్మకూరు డిఎస్పి-ఆర్. రామంజి నాయక్, ఆత్మకూరు రూరల్ సి.ఐ- ఎం.సురేష్ కుమార్ రెడ్డి, మరియు పాములపాడు ఎస్సై- పి .తిరుపాలు ఆధ్వర్యంలో పాములపాడు మండల కేంద్రమైన కె జి బి వి స్కూల్ లో బాల బాలికలకు మహిళలపై జరిగే నేరాల నియంత్రణ పై కార్యక్రమం నిర్వహించడమైనది.పాములపాడు మండల కేంద్రం లోని కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపాల్ యం. రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలపై నేరాలపై నియంత్రణపై అవగాహన కార్యక్రమం నికి ముఖ్య అతిథిగా ఆత్మకూరు డీఎస్పీ ఆర్. రామాంజి నాయక్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆత్మకూరు డిఎస్పి- ఆర్.రామాంజి నాయక్ మాట్లాడుతూ . మహిళలపై జరిగే నేరాల నియంత్రణ పై గురించి , బాల్య వివాహాలు గురించి అవగాహన కల్పిస్తూ కొన్ని ముఖ్య విషయాలు విద్యార్థినులకు, బాలికలకు చెప్పడమైనది.. సమాజంలో ఏమైనా తప్పు జరుగుతుంది. అని తెలిసినపుడు మీరు 100 డయల్ కాల్ కి ఫోన్ చేసి ఆ విషయం చెపితే మా పోలీసు సిబ్బంది అక్కడికి వచ్చి సమస్య ను పరిష్కరిస్తారు విద్యార్థులు కస్టపడి చదివి తమ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకునే దిశగా ముందుకు వెళ్లాలని చెప్పారు. అంతేకాకుండా…. ఇటీవల కాలంలో పిల్లలకు సెల్ ఫోన్ వినియోగం ఎక్కువైందని తల్లితండ్రులు పిల్లలకు జాగ్రత్తగా ఉండాలని, సెల్ ఫోన్ పిల్లలకు ఇవ్వకుండా చూసుకోవాలి అన్నారు. ఇప్పుడు ఉన్న ఈరోజుల్లో మీ బంగారు భవిష్యత్తు మీ చేతుల్లో ఉన్నది. మీరు మీ జీవితాలను మీరు మంచి మార్గంలో నడిస్తే మీకు విజయాలు మీ ముందు ఉంటావ్ . ముఖ్యంగా మీరు ఈ వయసు చదువుకున్న వయస్సు కాబట్టి చదువుకే ప్రాధాన్యత ఇవ్వాలి .ఇంకేమి మీరు వేరే ఆలోచనలు పెట్టుకోకూడదు. ఎక్కడెక్కడో నుంచి ఇక్కడ చదువుకొంటున్నారు కాబట్టి ఇప్పుడు ఉన్న రోజుల్లో ప్రేమ, పేరుతో అమాయకత్వం అమ్మాయిలను వలలో వేసుకొని మధ్యలోనే చదువు ఆపేసి ప్రేమ పేరుతో ఉన్న ఊరుని 20 సంవత్సరాలు పెంచి పోషించిన కన్న తల్లిదండ్రుల ను వదిలేసి వెళ్తే ఆపైన పడే బాధ తల్లి తండ్రులు చాలా రోదించడం తల్లడిల్లిపోవడం ఒక నరకం లాగా ఉంటుంది. తరువాత మీకు మీరు తల్లి తండ్రులు కాదని పెళ్ళి వయసు రాకముందే పెళ్లి చేసుకుంటే మీకు గర్భం వచ్చాక కూడా చాలా పురిటి నొప్పులతో సంతోషంగా కాన్పు కావడం కష్టం.. అవుతుంది. సరైన సమయంలో పెళ్లి వయసు వచ్చాక పిల్లలకు పెద్దలు తప్పకుండా పెళ్లి లు చేస్తారు. ఎలాంటి సమస్యలు తలెత్తవ్. కాబట్టి ఇప్పుడు ఉన్న రోజులో ఆడపిల్లలకు మంచి జీవితం ఉంది. 15 సంవత్సరాలు కిందట ఎవరికి అన్నం దొరికేది కాదు కానీ ఇప్పుడు ఉన్న రోజులో దేవుడు దయ వల్ల ప్రతి ఒక్కరి ఇంటిలో పుష్కలంగా అన్నం ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి ఒక యుగో, ఒక స్వతంత్ర గా బ్రతకాలి నాకెవ్వరు చెప్పకూడదు నాకు నేను సాటి అని ఫ్రీడమ్ ఫ్రీడమ్ అని పెద్దల మాటలు వినకుండా భవిష్యత్తు సర్వనాశనం చేసుకుంటున్నారు. నేను చెప్పేది ఒకటే ఒకటి బాల బాలికలకు ముఖ్యంగా మీరు మీ తల్లితండ్రులు ను గౌరవించండి తరువాత మీ ఉపాధ్యాయులను గౌరవించండి కానీ మీ బంగారు భవిష్యత్తు మీ చేతుల్లో ఉన్నది. ఏది కూడా అహంకారం తో నిర్ణయాలు తీసుకోకూడదు అందుకే ప్రతి ఒక్కరికి జవాబు దారితనం ఉండాలి. బాధ్యత ఉండాలి. మనం సొసైటీ లో బ్రతుకుతున్నాము మనం ఒక్కరే లేము వ్యవస్థ లో చాలా మంది ఉన్నారు నలుగురితో పాటు మనం బాధ్యత గల పౌరునిగా,బాధ్యత గల పౌరురాలుగా, మనం బ్రతకాలి అప్పుడే మనకు మంచి పేరు వస్తుంది. మీరు ఉన్నత చదువులు చదివి మీరు ఉన్నత స్థానం లోకి ఎదుగుతారని మీ ఉపాధ్యాయులకు, మీ ఊరికి మన జిల్లాకి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరుకుంటున్నాను అని విద్యార్థినులకు మంచి మంచి ముఖ్యమైన విషయాలు చెప్పడం జరిగింది. కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన పోలీస్ అధికారులకు మా తరుపున కృతజ్ఞతలు, చెప్పడం మరియు మా స్కూల్ లో ఈ మహిళలపై నేరాలపై అవగాహన కార్యక్రమం గురించి మన డీఎస్పీ సార్ వారు మా కోసం ప్రత్యేకంగా మా పిల్లల భవిష్యత్తు కోసం చాలా చాలా మంచి విషయాలు క్లుప్తంగా వివరించారు. అందుకు చాలా చాలా ధన్యవాదములు తెలుపుతూ ఈ కార్యక్రమం కస్తూర్బా గాంధీ పాఠశాల టీచర్స్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం అయినది.





