నేటి సాక్షి : పాములపాడులోని, జిల్లా పరిషత్ హైస్కూల్ మండల్ లెవెల్ గేమ్స్ సందర్భంగా ప్రతిభ కనబరుస్తున్న 30 మంది క్రీడాకారులకుస్ఫూర్తిదాయకంగా, ప్రేరణగా నిలిచిన సామాజికవేత్త & కాటం ట్రేడర్స్ అధినేత- కే.ప్రశాంత్ రాజ్ తమ వ్యక్తిగత శ్రద్ధతో క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, దుస్తులు పంపిణీ చేయడం విశేషం అన్నారు.ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ శ్రీధర్ రెడ్డి, మాట్లాడుతూ “ప్రశాంత్ రాజ్ లాంటి స్ఫూర్తిదాయక వ్యక్తులు సమాజానికి ఆభరణం. వారి సహకారంతో క్రీడాకారులు మరింత ఉత్సాహంతో ముందుకు సాగి మండలానికి మంచి పేరు తీసుకురావాలి,” అని పేర్కొన్నారు.అలాగే మండల క్రీడా సమన్వయకర్త రాజశేఖర్ , దామరేకుల.రవి, శ్రీనివాసులు మాట్లాడుతూ “విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా చురుకుగా పాల్గొనాలి. ఇండోర్ గేమ్స్ ద్వారా మానసిక చురుకుదనం, అవుట్డోర్ గేమ్స్ ద్వారా శారీరక దృఢత్వం పెరుగుతాయి. విద్యార్థి దశలో ఆటల ప్రాముఖ్యత అత్యంత కీలకం,” అని అన్నారు.> “ప్రశాంత్ రాజ్ స్ఫూర్తిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. విద్యార్థులు తమ ప్రతిభతో డివిజన్, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పాల్గొని తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి గర్వకారణంగా నిలవాలి,” అని కూడా వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు స్వామిశేఖర్, ఉపాధ్యాయ బృందం, క్రీడా అభ్యాసకులు, మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.




