*నేటి సాక్షి: నంద్యాల జిల్లాలోని, మండల కేంద్రమైన పాములపాడు దగ్గర నేషనల్ హైవే 340సి అండర్ బ్రిడ్జి కేవలం 4 మీటర్ల ఎత్తు వుండటం వలన ఎత్తు ఎక్కువగా వున్న ట్యాంకర్లు, చైన్ మిషన్లు, వరి కోత మిషన్ లు ట్యాలర్లలో పోయే ఏ వాహనం కూడా బ్రిడ్జి లో ఇరుక్కొని రైతులు, వాహన దారులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండల కో ఆఫ్టెడ్ మెంబర్ సయ్యద్.ముర్తుజాఅలి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల సమావేశంలో మండల కో ఆఫ్టెడ్ మెంబర్- ఎస్.ముర్తుజాఅలీ మాట్లాడుతూ ఈ ఫోటోలలో కనిపిస్తున్న దృశ్యం ఈరోజు, ఈ అండర్ బిడ్జిలో ఇరుక్కుపోయిన ట్యాంకర్ దని అన్నారు. జాతీయ రహదారి 340 సి అండర్ పాస్ వంతెన పనులు ప్రారంభించిన వెంటనే పాములపాడు మరియు కొత్తపల్లి మండలాల ప్రజలు నేషనల్ హైవే ప్రాజక్టు డైరెక్టర్ కి ఈ అండర్ పాస్ బ్రిడ్జి ఎత్తు తక్కువగా వుందని, దీనిలో వరిగడ్డి ట్రాక్టర్ లు మరియు పంట కూత మిషన్లు, బావులకు మిషన్లు, పత్తిలారీలు, తదితర భారీ వాహనాలు, పోవటానికి వీలు పడదు కావున తమరు దయచేసి బ్రిడ్జి ఎత్తు పెంచి బైపాస్ రోడ్డు కు ఇరువైపులా సర్వీసు రోడ్డు వేయాలని అర్జీ ద్వారా కోరడం జరిగిందన్నారు. మరియు ఈ విషయము తహసిల్దార్, జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అన్నారు. ఈ సమస్యపై ధర్నాలు, రాస్తారోకోలు నిరసనలు కూడా చేయడం జరిగింది అన్నారు. అపుడు పీడీ బ్రిడ్జి ఎత్తు 7 మీటర్లు వుంటదని, సర్వీసు రోడ్డు ఒకవైపు వేస్తాము అని హామీ ఇచ్చారు. కానీ ఇపుడు బ్రిడ్జి ఎత్తు కేవలం 4 మీటర్లు అని బోర్డు పెట్టారని, మరియు సర్వీసు రోడ్డు చేయకుండా వదిలేశారన్నారు. ఈ రోడ్డు సంగమేశ్వరం, కొలనుభారతి, మరియు కొత్తపల్లి మండలాలను కలుపు రహదారి అని అన్నారు. ఈ రోడ్డు ద్వారా దాదాపు 26 గ్రామాల ప్రజలు నిత్యం రాక పోకలు కొనసాగిస్తున్నారని అన్నారు. కావున ఇప్పటికైనా సమస్యను పరిశీలించి రోడ్డుకి ఇరువైపులా సర్వీసు రోడ్డు వేసి ప్రజల ఇబ్బందులు తీర్చవలసిందిగా కోరుతున్నామన్నారు. లేదంటే అన్ని రాజకీయ నాయకులతో, ప్రజాసంఘాల నాయకులతో, రెండు మండలాల ప్రజలతో కలిసి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.




