Friday, March 13, 2026

పాములపాడు మండలంలో ఘనంగా శ్రీ ధన్వంతరి జయంతి వేడుకలు సమాజ సేవకు విశేష కృషి చేస్తున్న హెడ్ కానిస్టేబుల్- ఎం.వి.రమణకు ఘనంగా సన్మానం చేసిన ప్రజాసంఘాల నాయకులు*. పాములపాడు అక్టోబర్ 18

నేటి సాక్షి : పాములపాడులోని, సేవా భారతి (వై ఆర్ డి ఎస్) కార్యాలయం దగ్గర నాయి బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు ఏం.వెంకట రమేష్ ఆధ్వర్యంలో శ్రీ ధన్వంతరి జయంతి వేడుకల సందర్భంగా చిత్రపటానికి హెడ్ కానిస్టేబుల్- ఎం.వి.రమణ, మండల కో ఆప్టేడ్ మెంబర్- సయ్యద్.ముర్తుజాఅలీ, బీసీ ఐక్య సంఘం అధ్యక్షుడు గట్టు.శంకర్ గౌడ్, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు- కలబండి.అంకన్న, తదితర ప్రజాసంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు నిర్వహించారు.ధన్వంతరి జయంతి సందర్భంగా సమాజ సేవకు విశేష కృషి చేస్తున్నందుకు పాములపాడు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్-ఎం.వి.రమణకు నాయి బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు- ఎం.వెంకట రమేష్, మండల కో ఆప్షన్ మెంబర్-సయ్యద్.ముర్తుజాఅలీ, బీసీ ఐక్య సంఘం అధ్యక్షుడు-గట్టు.శంకర్ గౌడ్, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.అంకన్న లు శాలువా కప్పి, ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య వక్తలు మాట్లాడుతూ ముందుగా నాయి బ్రాహ్మణులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలకు పేరుపేరునా శ్రీ ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. నాయి బ్రాహ్మణ కులానికి సంబంధించిన ధన్వంతరి వివిధ రకాల చెట్లకు, మొక్కలకు పండిన దినుసులతో ప్రజలకు ఆయుర్వేద వైద్యం చేసే వాడని అన్నారు. ఆయన నాయి బ్రాహ్మణ కుల వృత్తికి మూలపురుషుడిగా, వైద్యుడిగా ఆయన ప్రసిద్ధి చెందారని,ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున ధన్వంతరి జయంతిని జరుపుకుంటారని అన్నారు. ఈ పండుగ దీపావళి పండుగకు రెండు రోజుల ముందు వస్తుందని తెలిపారు. పురాణాల ప్రకారం, దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం చేసినప్పుడు, చివరగా శ్రీమహావిష్ణువు అంశగా ధన్వంతరి భగవానుడు అమృత కలశాన్ని చేతబట్టుకొని సముద్రం నుండి ఉద్భవించారు. ఈయన అమృతాన్ని తీసుకురావడం వలన, ఆయుర్వేద వైద్య శాస్త్రానికి మూలపురుషుడిగా కీర్తించబడ్డారని అన్నారు.భాగవత పురాణం ప్రకారం, ధన్వంతరి మహర్షి వైద్యం వలన ఆయురారోగ్యాలు, దీర్ఘాయుస్సు లభిస్తుందన్నారు.ఈ రోజున మందులు లేదా ఔషధాలను దానం చేయడం చాలా ప్రయోజనకరంగా భావిస్తారని అన్నారు. వైద్యులు మరియు విద్యార్థులు ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాములు, శివ, పెద్ద శేషన్న, చిన్న శేషన్న, కృష్ణ, ఎస్.జంషీర్ భాష, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News