Sunday, February 22, 2026

*పాములపాడు మండల విద్యుత్ అధికారులకు నిర్లక్ష్యం తగదు:- డీవీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు*

నేటి సాక్షి 21 ఫిబ్రవరి పాములపాడు:-పాములపాడు మండల విద్యుత్ అధికారులకు నిర్లక్ష్యం తగదని జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు ఆరోపించారు ఈ సందర్భంగా డివిఎంసి మెంబర్ లింగాల.నాగరాజు మాట్లాడుతూ పాములపాడు మండల కేంద్రంలో బస్టాండు ఆవరణలో మిట్టకందాలకు వెళ్లే టర్నింగ్ దగ్గర నిరుపయోగంగా ఉన్న పాత ఇనుప స్తంభాన్ని తీసివేసి, బడి పిల్లల బస్సులకు, భారీ వాహనాలకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరారు. ఈ సమస్యలపై ఎన్నోసార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రాలు సమర్పించిన విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కర్నూలు అదే మాదిరిగా ఆత్మకూరు నుండి వచ్చే వాడాల, మద్దూరు, నంద్యాల బడి పిల్లల బస్సులకు టర్నింగ్లో ఈ విద్యుత్ స్తంభం వలన ఇబ్బంది గురై, ట్రాఫిక్ కూడా సమస్యగా మారి, ఎన్నోసార్లు ప్రమాదాలు జరిగిన విద్యుత్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామాలలో రోడ్ల వెంట, పొలాలలో భూమికి నేల వాలుతున్న స్తంభాలను తొలగించకపోవడం వల్ల ప్రమాదాలకు గురై చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే మండల విద్యుత్ అధికారులు అప్రమత్తమై నేల వాలిన స్తంభాలను తీసివేసి, కొత్త స్తంభాలు వేయాలని ఆయన కోరారు. లేదంటే జిల్లా విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేస్తారని ఆయన హెచ్చరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News