సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ వేమూరి సత్యనారాయణ.
నేటి సాక్షి, మునగాల, ప్రతినిధి ,పాముల రాఘవేందర్.: తెలంగాణ హైకోర్టు పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలపై ఇచ్చిన తీర్పు శుభ పరిణామమని మండల పరిధిలోని నరసింహాపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. గత తొమ్మిది నెలల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరొక పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ . బిజేపి పార్టీలు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సోమవారం హైకోర్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాలలోగా చర్యలు తీసుకోవాలని. తెలంగాణ శాసనసభ స్పీకర్ కార్యాలయం కు ఆదేశాలు ఇవ్వడం అదేవిధంగా స్పీకర్ తగు చర్యలు సకాలంలో తీసుకోకపోతే ఈ కేసును హైకోర్టు సుమోటాగా తీసుకుని విచారణ చేపడతామనడం అభినందించదగ్గ విషయమని ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించి బీఫాం ఇచ్చిన పార్టీలను వదిలి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసి. పార్టీలు మారే ప్రజా ప్రతినిధులకు. ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదని అభివృద్ధి పేరుతో ఇతర పార్టీలకు వెళ్లడం దుర్మార్గమని. ఇలా పార్టీలు ఫిరాయించే ఎమ్మెల్యేలను మిగిలిన ప్రజాప్రతినిధులపై. అనర్హత వేటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని. ఇలాంటి తీర్పులతో సామాన్యులకు సైతం న్యాయస్థానాలపై మరింత నమ్మకం గౌరవం కలుగుతుందని. ఈ తీర్పు చారిత్రక ఘట్టమని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా తెలంగాణ స్పీకర్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వెంటనే. పిరాయించిన ఎమ్మెల్యేలపై. అనర్హత వేటు వేసి కోర్టు తీర్పును ప్రజల తీర్పును గౌరవించాలన్నారు.

