Thursday, March 19, 2026

పార్లమెంట్ మక ద్వారం ఎదుట వైయస్ఆర్‌సీపీ ఎంపీలు ఫ్లకార్డులతో నిరసన..కూటమి ప్రభుత్వ నిర్ణయం మార్చుకునే వరకు పోరాటం కొనసాగిస్తాం.. పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి

నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 15 ~అన్నమయ్య జిల్లా :-: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ వైయస్ఆర్‌సీపీ ఎంపీలు ఢిల్లీ వేదికగా నిరసన బాట పట్టారు. సోమవారం పార్లమంట్‌ సమావేశాల్లో పాల్గొన్న వైయస్ఆర్‌సీపీ ఎంపీలు సమావేశం పూర్తవగానే పార్లమెంట్ మకద్వారం ఎదుట ఏపీలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. ఎంపీలు వై.వీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, మద్దిల గురుమూర్తి, వైయస్ అవినాష్ రెడ్డి, తనుజ రాణి, అయోధ్య రామిరెడ్డిలు ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా వైయస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ‘ ఏపీలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసామని రాష్ట్రంలో కోట్లాది సంతకాలు సేకరించడం జరిగిందని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఈనెల 18న గవర్నర్‌ నజీర్ ను కలిసి కోటి సంతకాలు సేకరణ పై ఆయనకు వివరిస్తామని కూటమి ప్రభుత్వం తీసుకున్న అసమర్థత నిర్ణయంపై తమ గళం వినిపిస్తూనే ఉంటామని వాళ్లు తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకొని ప్రైవేటీకరణ వెనక్కి తీసుకేనేంతవరకూ పోరాటం ఆగదని హెచ్చరించారు..~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News