నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 04 ~అన్నమయ్య జిల్లా :-: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వైయస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి పై ప్రస్తావించారు. ఏపీలో రైతన్నలు పండించిన ఏ ఒక్క పంటకు సరైన గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యే శరణ్యమంటూ దిక్కు తోచని స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. గత వైసీపీ పాలనలో రైతులలో పండించిన పంటలకు వైయస్ జగన్ గిట్టుబాటు ధరలు కల్పించారు. ధరలు లేకపోయినా ప్రభుత్వమే కొని వాళ్లను ఆదుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరి పరిస్థితి దిక్కుతో స్థితిలో పడింది. గురువారం పార్లమెంటు సమావేశాల్లో మిథున్ రెడ్డి ప్రస్తావిస్తూ ఏపీలో అరటి పంట రైతన్నలు సంక్షోభంలో పడ్డారు. ఆ అరటి రైతులను తక్షణమే ఆదుకోవాలని మిథున్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. లోక్‌సభ జీరో అవర్‌లో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ గత ప్రభుత్వ పాలనలో ‘టన్ను 25 వేల రూపాయల ఉండే అరటి ఇప్పుడు కిలో 50 పైసలకు ధర పడిపోయింది. 50 పైసలకు ఒక బిస్కెట్ ఒక అగ్గిపెట్ట కూడా రాని పరిస్థితి. అలాంటిది అరటి కోత ధర కూడా కనీసం రైతుకు దక్కడం లేదు. గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత పంటల భీమా, ఇన్పుట్ సబ్సిడీ అందిస్తూ అరటిని ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు ప్రత్యేక రైళ్లలో రైతులలో పండించిన అరటిని ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అరటి పంటలో పూర్తిగా నీచ్చస్థితికి చేరుకున్న రైతన్నల పట్ల ప్రత్యేక చొరవ తీసుకొని తక్షణమే రైతులకు ఉచితంగా పంటల బీమా ఇవ్వాలి. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. అరటి పండ్ల సరఫరాకు ఎక్కువ రైళ్లను ఏర్పాటు చేయాలి. అరటి రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించాలి. నా నియోజకవర్గంలోని కోడూరు అరటి పంటకు కేంద్రంగా ఉంది. కేంద్ర బృందాలు ఈ ప్రాంతాన్ని సందర్శించి రైతుల కష్టాలను స్వయంగా చూడాలి. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు..~~~~~~~~~~~~~~~~~~





