Thursday, January 22, 2026

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలి.మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్.

నేటి సాక్షి వికారాబాద్:మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి తో కలిసి వికారాబాద్ పట్టణంలో పర్యటించిన వికారాబాద్ జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, రంగారెడ్డి జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నరేందర్ రెడ్డి మహేష్ రెడ్డి.అనంతరం వికారాబాద్ పట్టణం ఎన్నెపల్లి లోని బీ ఆర్ ఎస్ భవన్ (జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం) లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ఈ సమావేశంలో భాగంగా వికారాబాద్ జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కింది విధంగా స్పందించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ పైన కుట్రలు మాని, నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలి.జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉంది. కెసిఆర్ ప్రభుత్వ హయాంలో వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి మంజురైన సెంట్రల్ డ్రగ్ స్టోర్, డయాలసిస్ సెంటర్, డయాగ్నస్టిక్స్ సెంటర్, బ్లడ్ బ్యాంకు లలో ఫ్రిడ్జ్, బ్లడ్ సేకరించటానికి అవసరమైన పరికరాలు వెంటనే ఏర్పాటు చెయ్యాలని కోరారు. ఈ వసతులు లేక పేషెంట్లు ప్రైవేటు ఆసుపత్రిలకి వెళ్లి అధిక మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తుందని తెలిపారు.బీ ఆర్ ఎస్ హయాంలో నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు మంజూరు చేయించిన జెనరేటర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు రాలేదు.రైన పర్యవేక్షణ లేక వికారాబాద్ సాకేత్ నగర్ లో నిరుపయోగంగా మారిన జిమ్ పార్క్ ను మరమ్మతులు చేసి వెంటనే ఉపయోగంలోకి తీసుకురావాలని అధికారులను కోరారు.కెసిఆర్ హయాంలో అమ్మ ఒడి పథకం ద్వారా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గర్భవతుల/ బాలింతల సంరక్షణ కోసం ప్రభుత్వ వాహనాలు పెట్టి ఇంటి నుండి ఆసుపత్రికి తీసుకు వచ్చి, అవసరం అయినా అన్ని పరీక్షలు ఉచితంగా చేసి, తిరిగి వారిని ఇంటి దగ్గర దింపేది. కెసిఆర్ హయాంలో గర్భవతులకి కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ అలాగే తల్లి బిడ్డ సంరక్షణ కోసం కెసిఆర్ కిట్ అందించి వారి ఆరోగ్యం మీద ద్రుష్టి సారించారు. ఇప్పుడు అవి పూర్తిగా మాయమయ్యాయి.కెసిఆర్ హయాంలో దాదాపు 100 కోట్ల వ్యయంతో మంజూరైనటువంటి రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు రెండు సంవత్సరాలు ముగిసిన ఇంకా నత్త నడకన సాగుతూనే ఉన్నాయి, బ్రిడ్జి పనులలో వేగం పెంచి తొందరగా పూర్తి అయ్యేలా చూడాలి. వేల కోట్లు ఖర్చుపెట్టి మూసి సుందరీకరణ చేస్తానన్న రేవంత్ రెడ్డి వికారాబాద్ లో ఉన్న మూసీ నది జన్మస్థలన్ని గాలికి వదిలేసారని మడ్డిపడ్డారు.ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ , జిల్లా రైతు బంధు మాజీ అధ్యక్షులు రామ్ రెడ్డి, నాయకులు క్యామ మల్లేశం బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News