నేటి సాక్షి పాలేరు , అక్టోబర్ 24 :”అంగట్లో అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్టు” ఈ సామెత పాలేరు సంతకు చక్కగా సరిపోతుంది.. కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో ప్రతి శుక్రవారం వారపు సంత జరుగుతుంది.. ఈ వారపు సంత ద్వారా గ్రామ పంచాయతీకి లక్షల రూపాయల ఆదాయం సమకూరుతుంది. ప్రతి ఏటా జరిగే వారపు సంత వేలం పాటలో సంతకు లక్షల రూపాయల ఆదాయం వస్తుందనీ మీకు తెలుసా..? ఈ వేలం పాట ద్వారా లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి ఆదాయంగా మారుతుంది.. ఇంతవరకు బాగానే ఉన్నా , సంత ఆదాయానికి , అభివృద్ధికి కీలక పాత్ర వీధి వ్యాపారులదే వారికి కనీస సౌకర్యాలు లేకపోవడం కోస మెరుపు (కూరగాయలు అమ్ముకోవడానికి వచ్చే వారి వలనే ఆదాయం) .. ప్రతి వారం వారపు సంత రోజున దాదాపు 300 కూరగాయల దుకాణాలు వెలుస్తాయి .. ఆ రోజు వారపు సంత నుండి సంత నిర్వాహకులు వేల రూపాయలు వసూళ్లు చేస్తారు (ఒక్కో దుకాణం నుండి 50 రూపాయలు) అంటే అతిశయోక్తి కాదు.. ఇంత ఆదాయం వస్తున్న సంతలో కూరగాయలు అమ్ముకోవడానికి వస్తున్న వీధి వ్యాపారులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలం అవుతున్నారు.. కాదు అధికారుల నిర్లక్ష్యం కారణంగా వీధి వ్యాపారులు నష్టపోతున్నారు.. *వీధి వ్యాపారుల కష్టాలు పట్టించుకునే వారు లేరా..?* వీధి వ్యాపారుల కష్టాలు పట్టించుకునే నాథుడే కరువయ్యారు.. దీంతో వీధి వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు.. ప్రతి రోజులాగే ఈ శుక్రవారం జరిగిన వారపు సంత రోజు ఎడతెరపని వర్షంతో వ్యాపారం లేక పాలేరు సంత వేలవేల పోయింది. వేల రూపాయల విలువైన కూరగాయలు అమ్ముకోవడానికి సరైన అవస్థాపన సౌకర్యాలు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు.. సంతలో కనీస అవస్థాపన సౌకర్యాలు కల్పించడం ద్వారా (కూరగాయలను నిల్వచేయడానికి) వీధి వ్యాపారుల వ్యాపారం సజావుగా సాగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. ప్రతి శుక్రవారం జరిగే వారపు సంతలో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. కూరగాయలు అమ్ముకుంటున్నాం , వ్యాపారం చేసుకోవడానికి నిలువ నీడ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. తమ వల్లే ఇంత ఆదాయం వస్తున్నా.. తమకు మాత్రం చిన్న చిన్న సదుపాయాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.. వేలకు వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టీ కూరగాయలు పండిస్తున్నాం ( కొందరు మారు బేరం చేస్తున్నారు).. కానీ వర్షా కాలం , వాన కాలంలో కూరగాయలకు నీడ లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం.. తమ కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం సంత అభివృద్ధికి ఆలోచన చేయాలని కోరుతున్నారు.. *పశువుల సంతలో మరింత దోపిడీ..* ఇక పాలేరు సంతలో పశువులు సంత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. పశువులను కొనడానికి వచ్చిన , అమ్మడానికి వచ్చిన రహదారి ఖర్చుకు ఏం కొదవ ఉండదు. ఎంటర్ నుండి ఎగ్జిట్ వరకు పైసలతోనే పని.. ఒక రకంగా చెప్పాలంటే పాలేరు సంతకు ప్రధాన ఆదాయ వనరు పశువుల సంత.. ఇంత ఆదాయం వస్తున్న ఈ పశువుల సంతలో నిలబడడానికి నిలువ నీడ ఉండదు.. సంత రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండాల్సిందే.. వర్షా కాలంలో వర్షం వస్తె తడవాల్సిందే.. ఎండాకాలంలో అయితే ఇక అంతే సంగతి .. సంతకు వచ్చే వారి గొంతు తడుపుకోవటానికి కూడా మంచి నీటి చుక్క దొరకదు.. ఇక మూగ జీవాల పరిస్థితి చెప్పేది ఏమి లేదు.. దుమ్ము ధూళితో ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉంటారు.. మరి ఇంత ఆదాయం వస్తున్న సంతలో అవస్థాపన సౌకర్యాలు లేకపోవడం గమనార్హం.. ఆదాయం కావాలి కాని అవస్థాపన సౌకర్యాలు మాకు పట్టదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు అధికారులు.. ఇకనైన పాలేరు వారపు సంత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..





