Tuesday, March 10, 2026

పి ఆర్ టి యు. టీఎస్ నల్లబెల్లి మండల కమిటీ ఏకగ్రీవం.

అధ్యక్షునిగా ఉడుత రవీందర్.

ప్రధాన కార్యదర్శిగా బానోతు కృష్ణ.

నేటి సాక్షి, నల్లబెల్లి, జూన్ 27: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల పి ఆర్ టి యు.టి ఎస్ అధ్యక్షులుగా పనిచేస్తున్న నకిరెడ్డి మహేందర్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా ఖాళీ అయిన నల్లబెల్లి మండల అధ్యక్షుడి స్థానానికి జరిగిన ఎన్నిక సమావేశానికి వరంగల్ జిల్లా పిఆర్టియు. టీఎస్ అధ్యక్షులు ఈదునూరు రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎన్నిక నిర్వహించగా మండల ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఉడుత రాజేందర్ నీ అధ్యక్షునిగా, ప్రస్తుత మండల అసోసియేట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న బానోతు కృష్ణ ను మండల ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారులు ఖానాపూర్ మండల అధ్యక్షులు పెండెం భాస్కర్, చేన్నరావుపేట మండల అధ్యక్షులు పి. సురేందర్ గౌడ్ ప్రకటించారు. ఉడుత రాజేందర్ ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల కొండైలుపల్లి లో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పని చేస్తున్నాడు. గతంలో పిఆర్టియు టీఎస్ రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. బానోతు కృష్ణ ప్రస్తుతం యుపిఎస్ కొండాపూర్ పాఠశాలలో హిందీ పండిత్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. గతంలో పి ఆర్ టి యు టీఎస్ సంఘంలో మండల కార్యదర్శిగా, మండల అసోసియేట్ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు టి ఎస్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్కిరెడ్డి మహేందర్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు మందల తిరుపతిరెడ్డి, హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పలిత శ్రీహరి , పూర్వ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ మహమ్మద్ అబ్దుల్ గఫార్ , కాజీపేట మండల అధ్యక్షులు దేవి రెడ్డి మాలకొండ రెడ్డి ,నర్సంపేట డివిజన్లోని వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, నల్లబెల్లి మండలం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులు, ఎమ్మార్సీ సిబ్బంది, ప్రాథమిక కార్యకర్తలు పాల్గొన్నారు,

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News