నేటి సాక్షి 02 ఫిబ్రవరి ఆత్మకూరు:-నంద్యాల జిల్లా, ఆత్మకూరు పట్టణంలోని, థెరీసా జూనియర్ కాలేజీ నందు పి.ఆర్.టీ.యూ. ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష తెలిపారు.సుశ్రుత ఫౌండేషన్, ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ హైదరాబాద్ వారు సంయుక్తంగా పి ఆర్ టీ యూ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి పి.నాగూర్ ఖాన్, పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్లాపురం బాష, ఆత్మకూరు మండల విద్యాధికారి ఎం.అయూబ్ అహ్మద్, టీడీపీ టౌన్ క్లస్టర్ ఇంచార్జీ కమతం శంకర్, థెరిసా విద్య సంస్థల అకాడమిక్ డైరెక్టర్ సాయి ప్రణీత్ లు ప్రారంభించారు.అధిక సంఖ్యలో ఆత్మకూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని ప్రతి ఒక్కరూ ఉచిత కన్సల్టెన్సీ 5 వేల విలువైన వైద్య సేవలు పొందారన్నారు. వేరికో వీన్స్ తో బాధపడుతున్న 27 మందికి ఉచితంగా శస్త్ర చికిత్స చేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇబ్రహీం, పి.నూర్ మొహమ్మద్, హుస్సేన్ సాహెబ్, ఎస్.వి.రామిరెడ్డి, దామరేకుల రవి, ఆత్మకూరు మండల అధ్యక్షడు సి.ప్రదీప్ కుమార్, కొత్తపల్లి మండల అధ్యక్షుడు సయ్యద్.కలిముల్లా, వెలుగోడు మండల అధ్యక్షుడు సయ్యద్.మొహినుద్దీన్, పాములపాడు మండల ప్రధాన కార్యదర్శి హరినాథ్ బాబు, జిల్లా నాయకులు ఖాజా, తదితరులు పాల్గొన్నారు.





