నేటి సాక్షి 03. పాములపాడు:-పాములపాడులోని, జిల్లా పరిషత్ హైస్కూల్ దగ్గర పి ఆర్ టి యు నంద్యాల జిల్లా క్యాలెండర్, డైరీ లను పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష ఆధ్వర్యంలో మండల విద్యాధికారి-1 బాలాజీ నాయక్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్.శ్రీధర్ రెడ్డి లు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష మాట్లాడుతూ పలు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలి. 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి. పెండింగ్ డిఎ లు ఇవ్వాలని కోరారు. 2003 డీఎస్సీ పాత పెన్షన్ అమలు వేగవంతం చేయాలని కోరారు. ఉపాధ్యాయుల అర్థిక బకాయిల సరెండర్ లీవ్ ఏపీజిఎల్ఐ క్లెయిమ్స్ తదితరాలు చెల్లించాలని కోరారు. సిపిఎస్ వారికి పాత డిఎ బకాయిలు చెల్లించాలి అని అన్నారు.అనంతరం పిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష, పి ఆర్ టి యు రాష్ట్ర నాయకులు డి.రవి, జిల్లా నాయకులు రమేష్ రెడ్డి, రామచంద్రయ్య, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎ.సాంబశివుడు, పి.హరినాథ్ బాబు, మండల నాయకులు రంజిత్ కుమార్, విజయ్, దాక్షాయిని భాయి, ఉపాధ్యాయులు హైమవతి, రాంప్రసాద్, జయలత, మనోరంజని, శివనాగ లక్ష్మీ లతో కలిసి ఎంఈఓ-1 బాలాజీ నాయక్ కు శాలువాలు కప్పి, పుష్పగుచ్చం, డైరీ చేతికి అందించి ఘనంగా సన్మానం చేయడం జరిగింది.

