Monday, March 16, 2026

*పీలేరు రెవిన్యూ డివిజన్ కోసం**మంత్రి నారా లోకేష్ కి వినతి*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నిన్న జరిగిన “ప్రజా దర్బార్” లో భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలకుంట శ్రీనివాసులు మంత్రి లోకేష్ కు వినతిపత్రం సమర్పించి, ప్రజల సౌకర్యం కోసం – పరిపాలనా సౌలభ్యం కోసం.. పీలేరు కేంద్రంగా కొత్త రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి లోకేష్ దీనిపై చర్చించి, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారని భారతీయ అంబేడ్కర్ సేన (బాస్) రాష్ట్ర నేత పాలకుంట శ్రీనివాసులు మీడియా కు తెలిపారు. మంత్రి లోకేష్ ను కలిసిన వారిలో పాలకుంట శ్రీనివాసులు తోపాటు పీలేరు రెవిన్యూ డివిజన్ సాధన సమితి కన్వీనర్ నడిమికండ్రిగ సుధాకర్ బాబు, మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల ధరణి కుమార్ , మాల మహానాడు ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రం నారాయణ ,కాంగ్రెస్ పార్టీ పీలేరు మండల అధ్యక్షుడు దుబ్బ శ్రీకాంత్, డిబిఎస్ఎఫ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు బద్దె భాను ప్రకాష్ తదితరులు ఉన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News