నేటిసాక్షి, కరీంనగర్:ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలతో నేడు అన్ని రంగాల్లో భారతదేశం దూసుకుపోతోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం పేర్కొన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కాంగ్రెస్ కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుభాషా కోవిదుడు, 1991 నుండి 1996 వరకు ఈ దేశానికి ప్రధాన మంత్రిగా పనిచేసి పారిశ్రామిక విధానాలను ప్రవేశపెట్టడంతో గ్లోబలైజేషన్ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టం చేశారని గుర్తుచేశారు. పీవీ తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలతో నేడు ప్రపంచ దేశాలతో మనదేశం అన్ని రంగాల్లో పోటీ పడుతోందని, ఆయన మన ప్రాంతానికి చెందినవారు కావడం మనందరం గర్వించదగ్గ విషయమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఏఐసీసీ అధ్యక్షునిగా పనిచేయడమే కాకుండా, మైనారిటీ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ను ఆర్థిక శాఖ మంత్రిగా నియమించి ఈ దేశాన్ని ముందుకు నడిపించారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కర్ర రాజశేఖర్, బానోతు శ్రావణ్ నాయక్, వంగల విద్యసాగర్, దన్న సింగ్, పొన్నం మధు, సిరికొండ శివప్రసాద్, కుంభాల రాజు కుమార్, గంగుల దిలీప్,పర్వత మల్లేశం, కంకణాల అనిల్ కుమార్ గుప్తా, చింతల కిషన్, మాదాసు శ్రీనివాస్, శ్రీరాముల రమేష్, వీర దేవేందర్, సత్తినేని శ్రీకాంత్, సరిల్లా రతన్ రాజు, సుదర్శన్, స్వప్న శ్రీ, తదితరులు పాల్గొన్నారు.





