Tuesday, March 10, 2026

పీసీ కుంటలో సమస్యలను పరిష్కరించండి

నేటి సాక్షి,నారాయణపేట, జులై 3,

నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని పెద్ద చింతకుంట గ్రామంలోని స్టేజి కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో కురిసిన వర్షానికి నీళ్లు ఎక్కడ పడితే అక్కడ నిలిచి ఉండడంతో దోమలు విపరీతంగా ఉన్నాయని పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన మల్లెల వెంకటన్న తెలిపారు. గురువారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ కాలనీవాసులకు దోమలతో వ్యాధులు వస్తున్నాయని ఆయన వివరించారు. ఇటీవల గ్రామంలో పందులు విపరీతంగా ఉండడంతో గుంతలలో పడి చనిపోతున్నాయని ఆయన వివరించారు. గ్రామంలో వీధిలైట్లు సక్రమంగా వెలగడం లేదని ఆయన తెలిపారు. గ్రామపంచాయతీ సిబ్బంది అధికారులు పట్టించుకోవడంలేదని ఆయన వివరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News