నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జనవరి 29 పుంగనూరు రూరల్( చౌడేపల్లి) సర్కిల్ ఇన్స్పెక్టర్ గా సాయి ప్రసాద్ నియమితులయ్యారు .గురువారం ఈ మేరకు ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో తన ఛాంబర్ నందు బాధ్యతలు చేపట్టారు గతంలో ఇక్కడ పనిచేస్తున్న రాంభూపాల్ అనంతపురం వి ఆర్ కు బదిలీ కాగా అదే జిల్లా తాడిపత్రిలో పనిచేస్తున్న సాయి ప్రసాద్ ఇక్కడికి నియమితులయ్యారు న్యాయం కోసం వచ్చే బాధితులకు ప్రాధాన్యత ఇస్తానని చట్టపరంగా వారికి రక్షణ కల్పిస్తానని ఈ సందర్భంగా ఆయన అన్నారు .ఫ్రెండ్లీ పోలీసింగ్ ను ప్రోత్సహిస్తానని అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కు పాదం మోపుతానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఎస్సై నాగేశ్వరరావు సోమల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడులు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్కిల్ ఇన్స్పెక్టర్ సాయి ప్రసాద్ ను సన్మానించారు





