Saturday, March 14, 2026

*పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి సహాయం చేయడం అభినందనీయం* * బాపట్ల డిఎస్పి జి రామాంజనేయులు * లోతట్టు ప్రాంతాల 50 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ * పంపిణీ చేసిన బాపట్ల డిఎస్పి రామాంజనేయులు, మొహిద్దిన్ బేగ్.

నేటి సాక్షి, బాపట్ల జిల్లా (కర్లపాలెం)కర్లపాలెం మండలం తుమ్మలపల్లి పునరావస కేంద్రాల్లో ఉన్న వారికి సహాయం చేయుట అభినందనీయమని బాపట్ల డి.ఎస్.పి జి రామాంజనేయులు అన్నారు. మంగళవారం ఎండి .మొహిద్దిన్ బేగ్ సహకారంతో కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సమక్షంలో మండల పరిధిలో ఉన్న లోతట్టు ప్రాంతమైన తుమ్మలపల్లి లో 50 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొహిద్దిన్ బేగ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటము మానవతా ధర్మమని అన్నారు. ఈకార్యక్రమంలో బాపట్ల సీఐ హరికృష్ణ, కర్లపాల్ ఎస్ఐ రవీంద్ర, కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనకొల్లు పోలీసు రావు, మందపాటి పరమానంద కుమార్, కర్లపాలెం గ్రామ ఉపసర్పంచ్ పటాన్, అజీమ్ ఖాన్, సర్పంచి దెబ్బకూటి ఏడుకొండలు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News