నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)…………………………………… జగిత్యాల పట్టణంలోని నిరుపేద కుటుంబాలలో మరణించిన వారికి జగిత్యాల పురపాలక సంఘం ద్వారా ఉచిత దహాన సంస్కారాలు నిర్వహించాలని AO ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. నాయకులు మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలోని నిరుపేద కుటుంబాలలో మరణించిన వారికి మున్సిపల్ ద్వారా ఉచితంగా దహన సంస్కారాలు నిర్వహించాలి అని కోరారు . జగిత్యాల పట్టణంలో చాలామంది నిరుపేద కుటుంబాలకు చెందిన కుటుంబాలలో ఎవరైనా మరణిస్తే స్థానిక స్మశాన వాటికలలో దహన సంస్కారాల నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకుంటుంది. స్మశానాలను నిర్వహించే వ్యక్తులు కట్టెలు, ఇతర సామాగ్రి కోసం సుమారు 10వేల నుండి 15వేల వరకు డిమాండ్ చేస్తుండడంతో నిరుపేద లు ఆ ఆర్థిక భారాన్ని మోయలేక మానసిక వేదనకు గురవుతూ ఎన్నోఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని స్మశానాల నిర్వహణ మున్సిపల్ వారికి అప్పగించి,నిరుపేదలకు ఉచితంగా దహన సంస్కారాలు చేసే ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము. కరీంనగర్ కార్పొరేషన్ లో ఒక్క రూపాయికే దహన సంస్కారాలు నిర్వహించే పథకం అమలులో ఉన్నందున అలాంటి పథకాన్ని జగిత్యాల లో అమలు చేసి నిరుపేదలకు అండగా ఉండాలని కోరారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ACS రాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కినపల్లి కాశీనాథం,కార్యదర్శి సింగం గంగాధర్, సమరసత వేదిక జిల్లా అధ్యక్షులు చిట్ల గంగాధర్, పట్టణ అధ్యక్షుడు బొందుకూరి శ్రీనివాస్,చారి వేముల దేవరాజం, నరేందుల శ్రీనివాస్, కొత్తకొండ బాలన్న,గాదాసు భూమన్న, అను మల్ల భుజంగం, బండారి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.





