నేటి సాక్షి, కొడిమ్యాల
17.జూన్
కొడిమ్యాల మండలంలోని పూడూరులో ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఐ సి డి ఎస్ సూపర్వైజర్ సుధారాణి. మాట్లాడుతూ ఫ్రీ ప్రైమరీ పిల్లలకు అక్షరాభ్యాసంతో చదువు నేర్చుకోవడం ఆరంభం జరుగుతుందని, తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాలను మరింత పటిష్టం చేసిందని, అంగన్వాడీ కేంద్రాలలో ప్రీ ప్రైమరీ పిల్లలకు ఆంగ్ల విద్యను అందించడంలో అంగన్వాడి టీచర్లు సంసిద్ధతతో ఉన్నారని, అంగన్వాడి కేంద్రాలు ఆలనా – పాలన కేంద్రాలుగా పేరుగాంచాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ సురేఖ.వసంత, స్నేహలత. పుష్పలత.పిల్లల తల్లులు ,ప్రీ ప్రైమరీ పిల్లలు, తదితరులు పాల్గొన్నారు.

