నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 14 నిర్మాణంమండలంలోని శెట్టిపేట పంచాయతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మేకల చిన్నేపల్లి పూర్వ విద్యార్థి, కొత్తపల్లి సదాశివ రెడ్డి పాఠశాలలో 2008 సంవత్సరంలో చదివి, సాప్ట్వేర్ గా పని చేస్తున్నాడు చదివిన పాఠశాలకు ఏదో ఒకటి చేయించాలనే మంచి ఉద్దేశంతో విద్యార్థుల సౌకర్యార్థం దాదాపు లక్ష రూపాయల వ్యయంతో సైకిల్ స్టాండ్ షెడ్ ను నిర్మించి బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు బహుమతిగా అందించాడు ఈ సందర్భంగా సదాశివ రెడ్డిని పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తరఫున ఘనంగా సత్కరించి ధన్యవాదములు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ దాత నారాయణ రాజు ఉపాధ్యాయులు లింగమూర్తి, గోవింద్ రామకృష్ణ, విజయశ్రీ, మోహన్, నాగ మునికృష్ణ మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు





