నేటి సాక్షి,వేమనపల్లి;మండల కేంద్రంలోని నీల్వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2008-2009 సంవత్సరం పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల అత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది.ఇక్కడ విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు వివిధ స్థాయిలో ఉన్నవారు అందరూ హాజరయ్యారు.పూర్వ విద్యార్థులు నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 16 సంవత్సరాల తర్వాత అప్పట్లో చదువుకున్న మిత్రులను కలవడం చాలా సంతోషకరమని ఈ పాఠశాలల్లో చదివి కొందరు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రైవేటు రంగాల్లో రాజకీయ రంగాల్లో రాణిస్తున్నామని క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామని అన్నారు.తమకు విద్యను బోధించిన ఉపాధ్యాయులకు రాజ్ కుమార్,బాపురావు,సత్యనారాయణ,శ్రీనివాస్ రెడ్డి,లక్ష్మీనివాస్ ముందడా,గీత ఉపాధ్యాయులకు సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.