Wednesday, March 11, 2026

పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలి– సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం దినకర్

నేటి సాక్షి కొమరం భీమ్ ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ ఎదుట ఖాళీ గ్యాస్ బండతో సీపీఎం నిరసనకేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ వద్ద ఖాళీ గ్యాస్ బండతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం దినకర్ మాట్లాడుతూ, గృహ వినియోగ గ్యాస్‌పై రూ.60, కమర్షియల్ గ్యాస్‌పై రూ.115 పెంపు సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నదని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనాలోచిత విదేశాంగ విధానాల వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని విమర్శించారు.యుద్ధ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఇజ్రాయెల్, అమెరికాలకు మద్దతు ఇవ్వడం వల్ల ఇరాన్ మన దేశానికి వచ్చే చమురు ట్యాంకర్లను సముద్రంలో నిలిపివేసిందని పేర్కొన్నారు. ఇరాన్ ఎప్పటి నుంచో మన మిత్రదేశమని గుర్తు చేశారు. అమెరికా మెప్పుకోసం మోడీ ప్రభుత్వం మిత్రదేశాలతో సంబంధాలు దెబ్బతీస్తోందని అన్నారు.రష్యా నుండి రోజుకు 20 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతి చేసుకునే ఒప్పందాన్ని అమెరికా ఒత్తిడితో 10 లక్షల బ్యారెళ్లకు తగ్గించుకున్నారని విమర్శించారు. అమెరికా చెప్పినట్లే దిగుమతులు చేయడం, వద్దంటే ఆపేయడం వంటి విధానం చూస్తుంటే దేశ సార్వభౌమత్వం ప్రమాదంలో పడుతున్నదని అన్నారు.మోడీ ప్రభుత్వం వెంటనే అలీన విదేశాంగ విధానానికి అనుగుణంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలపై భారమయ్యే విధానాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు గుడిసెల కార్తీక్, టికానంద్, నాయకులు నిఖిల్, రాజ్‌కుమార్, పవన్తో పాటు మహిళలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News