Monday, March 16, 2026

*పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి.**సిపిఐ ఆధ్వర్యంలో నిరసన*

*నేటిసాక్షి, నల్లబెల్లి* పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో సిపిఐ ఆధ్వర్యంలో గ్యాస్ పొయ్యికి పూలమాలవేసి కట్టెల పొయ్యి పై వంటచేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ మెంబర్ చింతకింది కుమారస్వామి పాల్గొని మాట్లాడుతూ…అమెరికా ఇజ్రాయిల్ ఉమ్మడిగా ఇరాన్తో యుద్ధానికి సిద్ధమయ్యే సూచనలు ప్రపంచానికి తెలిసినప్పటికీ మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు అవసరమైన గ్యాస్ చమురు నిలువలను పెంచుకోవడానికి ఎలాంటి కృషి చేయకుండా యుద్ధాన్ని ఆసరాగా చేసుకుని గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపినందన్నారు. యుద్ధ సమయంలో దేశంలో 50 రోజులకు సరిపడా మాత్రమే గ్యాస్ డీజిల్ పెట్రోల్ నిలువలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతుందన్నారు. ఇందులో కూడా 50 శాతం నిలువలను దేశ సైన్యానికి కేటాయిస్తూ మిగతా 50 శాతం నిల్వలను మొత్తం 140 కోట్ల ప్రజలకు కేటాయించారన్నారు .ఈ నిల్వలు అతివేగంగా తరుగుతున్నాయని ఈ క్రమంలో గ్యాస్ కంపెనీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని గృహ, వ్యాపార గ్యాస్ సిలిండర్లను దొరకకుండా బ్లాక్ చేస్తున్నట్టు పరిస్థితులను బట్టి అర్థమవుతుందన్నారు .కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్, డీజిల్, పెట్రోలు నిలువలు తగినంత ఉన్నాయని దేశ ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెబుతున్నప్పటికీ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు. ఇప్పటికే చిరు వ్యాపారస్తులు,హోటల్లు, రెస్టారెంట్లు దాదాపుగా మూసివేస్తున్నారన్నారు. అదేవిధంగా జోమాటో స్విగ్గీ వర్కర్లు వేలాదిమంది ఉపాధి కోల్పోతున్నారన్నారు.ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి మోడీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పాటించకుండా ట్రంపుకు తలొగ్గడంతోనే భారత పరిస్థితి దిగజారిందన్నారు.ఇరాన్ పై చేస్తున్న యుద్ధానికీ నిరసనగా, ట్రంప్ నెతన్యాహు , మోడీ చిత్రపటాలను ప్రదర్శించారు .ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వైనాల వీరస్వామి, సిపిఐ మండల కార్యదర్శి కడియాల క్రాంతి కుమార్,మామిండ్ల అయిలయ్య, పిట్టల రామస్వామి,శ్రీహరి,బిట్ల సారంగం,సామాల దేవేందర్,సారంగం, నారాయణస్వామి, బాబురావు,మల్లారెడ్డి , తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News