ఎ ఐ సి సి టి యూ. జిల్లా. నేత మావులూరి విశ్వనాద డిమాండ్.
నేటి సాక్షి అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్
జిల్లా వ్యాప్తంగా, మరియు రాయచోటి ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు పెండింగ్లో ఉన్న నాలుగు నెలల వేతనాలు ఇవ్వాలని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో. విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నదని ఆరోపించారు. పీలేరు ప్రభుత్వ హాస్పిటల్లో శానిటేషన్ కార్మికులకు నాలుగు నెలలు అవుతున్న వేతనాలు రాకపోవడం అన్యాయం అని తెలిపారు. అప్పులు తెచ్చుకున్న సరిపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు .జీవో నెంబర్ 549 ప్రకారం 16,000 వేతన ఇవ్వాల్సి ఉండగా, కేవలం 11800 మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. అడిగితే బెదిరించడం దుర్మార్గం అని తెలిపారు. అంతేకాకుండా 16000 ఇవ్వాల్సినటువంటి డబ్బులు 11800 ఇవ్వడంలో అంతర్యం ఏమిటని తెలిపారు. ఈ డబ్బులు కాంట్రాక్టర్ కాజేసి కొల్లగొట్టడం సరైనది కాదని తెలిపారు .ఈఎస్ఐ పీఎఫ్ అప్డేట్ కట్టడం లేదని ఆరోపించారు= ముఖ్యంగా వీక్లీ ఆఫ్ లు ఇవ్వకపోవడం, క్యాజువల్ సెలవులు ఇవ్వ కపోవడం సరైనది కాదని ఆయన తెలిపారు. 100 పడకల ఆసుపత్రులు పేరు కు మాత్రమే అన్నారు కేవలం 14 మంది మాత్రమే పనిచేయడం వల్ల కార్మికులకు అదనపు భారం పడుతుందన్నారు .కనుక అధికారులు ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని కార్మికుల సంఖ్యను పెంచాలని కోరారు. అంతేకాకుండా పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు . కార్మికులతో వెట్టి చాకిరి చేయించుకుంటూ, వేతనంలో కోత కోస్తున్న కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శరత్ ముంజునాద్ రెడ్డి అనే కాంట్రాక్టర్లుకార్మికుల బాధలు పట్టించుకోకుండా, కార్మికుల సొమ్మును దోచుకుంటున్న శరత్ ను అలాగే. మంజునాథ రెడ్డి లను. తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో శానిటేషన్ యూనియన్. అద్యక్షులు. రామాంజనేయులు. కార్యదర్శి రెడ్డి శేఖర్. కార్మికులు పాల్గొన్నారు.





