Friday, March 13, 2026

పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి. రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. స్కావెంజర్స్ అమౌంటును విడుదల చేయాలి.టీఎస్ యుటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ వెంకటరత్నం.

నేటి సాక్షి వికారాబాద్:తెలంగాణ రాష్ట్రంలో గత మూడు నాలుగు సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వెంటనే గ్రాటివిటీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ వెంకటరత్నం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు గత మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కొందరు ఆవేదనతో మరణిస్తున్నారని, కొందరు ఇండ్ల నుండి పారిపోయే పరిస్థితి ఏర్పడిందని, అదేవిధంగా సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సరెండర్ లీవులు గాని, డిఏ బకాయిలు గాని జిపిఎఫ్ బకాయిలు గాని తదితర వాటన్నింటినీ విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్స్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒకరి కోసం అందరం అందరికోసం ఒకరం అనే నినాదంతో ఏర్పాటు చేసిన ఎఫ్డబ్ల్యుఎఫ్ లో సభ్యులుగా చేరాలని కోరారు. ఈ సందర్భంగా వికారాబాద్ పట్టణంలో గల వివిధ పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. వికారాబాద్ మండలంలో టి యస్ యూటిఫ్ మంచి ఆదరణ లభించిందని అన్నారు. జిల్లా కలెక్టర్ స్కావెంజర్ వేతనాలు విడుదలలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వెంటనే విడుదల చేయాలి టీఎస్ యుటిఎఫ్ డిమాండ్. వికారాబాద్ జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాఠశాలల పరిశుభ్రత కొరకు నియమించిన సర్వీస్ పర్సన్ల జీతాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు విడుదల చేయాలని టీఎస్ యుటిఎఫే జిల్లా అధ్యక్షులు సి హెచ్ వెంకట్ రత్నం డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వము ఆదేశించిన ప్రకారం 30 మంది విద్యార్థులు వరకు పాఠశాలలకు రూ 3000, 31 నుండి 100 వరకు విద్యార్థులు ఉన్న రు 6000, 100 నుండి150 వరకు విద్యార్థులు ఉన్న రు 8000,ఆపైన ఉన్నవారికి రూ. 18,000 నెలకు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశి ఆదేశించినప్పటికీ వికారాబాద్ జిల్లా కలెక్టర్ గత సంవత్సరము మూడు నెలల కు సంబంధించిన పారితోషము విడుదల చేసి ఈ సంవత్సరము గత సంవత్సరానికి సంబంధించిన నిధులు ప్రతి పాఠశాలకు 3000 చొప్పున ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా జారీ చేయడం ఏమిటని ప్రశ్నించారు వికారాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి పాఠశాలకు పై విధంగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు లేనిచో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు తదితరులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ స్కావెంజర్ వేతనాలు విడుదలలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వెంటనే విడుదల చేయాలి టీఎస్ యుటిఎఫ్ డిమాండ్. వికారాబాద్ జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాఠశాలల పరిశుభ్రత కొరకు నియమించిన సర్వీస్ పర్సన్ల జీతాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు విడుదల చేయాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేశారు దౌల్తాబాద్ మండల టీఎస్ యుటిఎఫ్ సభ్యత్వ కార్యక్రమంలో నమోదులో భాగంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వము ఆదేశించిన ప్రకారం 30 మంది విద్యార్థులు వరకు పాఠశాలలకు రూ .3000, 31 నుండి 100 వరకు విద్యార్థులు ఉన్న రు 6000, 100 నుండి150 వరకు విద్యార్థులు ఉన్న రు 8000,ఆపైన ఉన్నవారికి రూ. 18,000 నెలకు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశి ఆదేశించినప్పటికీ వికారాబాద్ జిల్లా కలెక్టర్ గత సంవత్సరము మూడు నెలల కు సంబంధించిన పారితోషము విడుదల చేసి ఈ సంవత్సరము గత సంవత్సరానికి సంబంధించిన నిధులు ప్రతి పాఠశాలకు 3000 చొప్పున ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా జారీ చేయడం ఏమిటని ప్రశ్నించారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి పాఠశాలకు పై విధంగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు లేనిచో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించా ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు, జిల్లా ఆఫీసు బేరర్స్ నీలమ్మ, బాబురావు,బసప్ప, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.రాములు, తిరుపతయ్య జిల్లా కమిటీ సభ్యులు వినోద్ కుమార్, నరేష్ మండల ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ కన్వీనర్ ప్రభాకర్, మండల నాయకులు నర్సింలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News