నేటి సాక్షి(పూరెళ్ల బాపు)………………………………….బిజెపి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక తహశీల్దార్ కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు . మున్సిపల్ మ్యానేజర్ గారికి వినతిపత్రం సమర్పించారు. నాయకులు మాట్లాడుతూ ఇది మున్సిపాలిటీ చేతగానితనం, అధికారుల పట్టిం పులేనితనం, పాలకవర్గాల అవినీతి వల్లే 100 కోట్లకు పైగా విలువ చేసి మున్సిపల్ భూమి అన్యాక్రాంతమైందని అన్నారు. 70 ఏళ్లు సమస్యను మున్సిపాలిటీ పరి ష్కరించలేకపోతున్నదంటే పాలకవర్గాలు, అధికారుల్లో ఎంతటి నిర్లక్ష్యం. అవినీతి ఉన్నదో అర్థం చేసుకోవచ్చు అని విమర్శించారు. 1964లో వివాదం ఏర్పడినప్పుటి నుంచి మున్సిపల్ పాలకవర్గాలు భూమిని స్వాధీనం చేసుకునే అంశంపై దృష్టిపెట్ట లేదు. బంక్ యాజమాన్యంతో కుమ్మక్కయి ఎన్నడూ పట్టించుకున్న దాఖలాలు లేవు.యావర్ రోడ్డు విస్తరణ నినాదం కేవలం ఎన్నికల హామీగానే మారిపోయిందని, రోడ్డు వెడల్పు లేక ఎంతోమంది రోడ్డు ప్రమాదాలకు గురై మృతి చెందుతున్న అధికార పార్టీ నాయకులు పట్టించుకోవడంలేదని బిజెపి నాయకుల ఆరోపించారు. వెంటనే బంక్ నీ మరియు కాంప్లెక్స్ నీ తొలగించాలని డిమాండ్ చేశారు లేని యడల బిజెపి మున్సిపల్ కార్యాలయం మరియు పెట్రోల్ బంక్ ముట్టడిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ACS రాజు, సీనియర్ నాయకులు సిపెళ్ళి రవీందర్, మాజీ అసెంబ్లీ కన్వీనర్ లింగాంపెట్ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ అరవ లక్ష్మి, మాజీ బిజెపి పట్టణ అధ్యక్షుడు అంకర్ సుధాకర్, టకుర్ కిషోర్ సింగ్, బషెట్టి ప్రభాకర్, మాడిషెట్టి మల్లేశం, నవ్వొట్ సురేష్, బుర్ర ప్రమోద్, గొడిసెల నాగరాజు, బిట్టు, నరేష్, నల్ల నారాయణ రెడ్డి, ఎడమల వెంకట్ రెడ్డి, ఎర్ర శ్రీనివాస్ , వేముల సునీల్ తదితరులు పాల్గొన్నారు.





