నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా మదనపల్లి, శర్మ ~అన్నమయ్య జిల్లా -:- ఆంగ్ల నూతన సంవత్సర దినాన్ని పురస్కరించుకొని తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, కవితమ్మ దంపతుల క్షేమం కోరుతూ మరియు పెద్దిరెడ్డి కుటుంబం ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం పెట్టే వడిదుడుకులను ఎదుర్కొంటు మరింత దీటుగా ప్రజలకు సేవ అందించాలని కోరుతూ బురకాయలకోట గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం గ్రామ ఎంపీటీసీ లక్ష్మీదేవి ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేయించారు. ఆలయ వేద పండితులు నగేష్ స్వామి గోత్ర నామాలను పఠిస్తూ వేదమంత్రాలతో పెద్దిరెడ్డి కుటుంబం పేరిట వివిధ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ లక్ష్మీదేవి నియోజకవర్గ ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే పెద్దిరెడ్డి కుటుంబానికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ వారికి ఈ సంవత్సరమంతట మంచి జరగాలని వారికి ఎలాంటి ఆపదలు, ఇబ్బందులు కలగకుండా అమ్మవారు కాపాడుకు రావాలని వేడుకున్నట్టు ఆమె తెలిపారు. ఈ సంవత్సరం బాగా వర్షాలు కురిసి రైతులు పండించిన పంటలు బాగా చేతికొచ్చి వాళ్ల శ్రమకు తగ్గ ఫలితమిచ్చి వారిని లాభదాయకంగా నడపాలని అమ్మవారిని వేడుకున్నానని అలాగే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి దంపతులకు ముత్యాలమ్మ తల్లి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆమె చల్లటి ఆశీస్సులతో వారికి ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని వేడుకున్నట్టు ఆమె తెలిపారు. ప్రజలకు ఎలాంటి రోగ పీడిత వ్యాధులు దరి చేరకుండా ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకున్నట్టు ఆమె తెలిపారు.~~~~~~~~~~~~~~~~~

