నేటి సాక్షి, నారాయణపేట ఏప్రిల్ 9 (రిపోర్టర్ ఇమామ్ సాబ్ ),నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మన్‌పాడు గ్రామంలో పేకాట ఆడుతున్న వారిపై రూరల్ ఎస్సై సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి రూ. 4,330 నగదు, 04 సెల్ ఫోన్లు, 02 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించిఈ ఘటనపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు రూరల్ ఎస్సై సతీష్ రెడ్డి తదితరులు తెలిపారు.





