నేటి సాక్షి, నారాయణపేట,ఏప్రిల్ 28, నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయిన్పల్లి గ్రామ శివారులో కొంతమంది వ్యక్తులు డబ్బులు పందెం పెట్టుకుని పేకాట ఆడుతుండగా టాస్క్ఫోర్స్, నారాయణపేట రూరల్ పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురు వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుండి 6 సెల్ ఫోన్లు, నాలుగు బైకులు, 3450/- రూపాయలు పేక ముక్కలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి గేమింగ్ ఆక్ట్ ప్రకారం వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని రూరల్ ఎస్ఐ రాముడు తెలిపారు.