Sunday, March 15, 2026

పేటలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం..

నేటి సాక్షి నారాయణపేట నవంబర్ 3,ఐకెపి అయ్యవారిపల్లి వరి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ఏఎంసీ చైర్మన్ సదాశివరెడ్డి పి ఎస్ సి ఎస్ సి చైర్మన్ పుట్టి ఈదప్ప కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ బాల్రెడ్డి మాధవరెడ్డి సార్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా సంఘం అధ్యక్షురాలు పుష్ప సిసి గోపాల్ అయ్యవారిపల్లి దేశయిపల్లి ముస్తపేట గ్రామ పెద్దలు రైతులు పాల్గొని వరి కొనుగోలు కేంద్రానికి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఎంసీ చైర్మన్ సదాశివరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో రైతులందరికీ ఇట్టి కొనుగోలు కేంద్రాలపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి మద్దతు ధరకు రైతులు కొనుగోలు సెంటర్ల దగ్గరనే తూకాలు చేసి మిల్లుకు పంపియాలని అదేవిధంగా కొనుగోలు సెంటర్లో అన్ని వసతులతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సెంటర్ నిర్వాహకులు చూసుకోవాలని మాట్లాడడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News