Friday, March 20, 2026

పేట జిల్లాకలెక్టర్ గారు మీరైనా స్పందించండి….. పెచ్చులు ఊడుతున్న ఎస్సీ హాస్టల్ భవనం….. పట్టించుకోని అధికారులు…. కనీస సౌకర్యాలు కూడా కరువే…..

నేటి సాక్షి నారాయణపేట, మార్చి 20( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలో గల ప్రభుత్వ దళిత అభివృద్ధి బాలుర వసతి గృహానికి సంవత్సరాలు గడుస్తున్న పాలకులకు అధికారులకు ప్రజాప్రతినిధులకు ఏమాత్రం పట్టించుకున్న దాఖలా లేవని పలువురు విమర్శిస్తున్నారు. దన్వాడ విద్యార్థులకు సరిపడే వసతిగృహాన్ని అప్పట్లో నిర్మాణాన్ని భవనాన్ని నిర్మాణం చేయడం జరిగింది. భవనం నిర్మాణం లోపాలు జరిగినందువలన కాంట్రాక్టర్ నిర్మాణంలో లోపాల వలన వసతిగృహం పైకప్పు సిమెంట్ పెచ్చులు ఊడిపోయి సీకులు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం గత సంవత్సరంలో 263 మంది విద్యార్థులు ఉండగా,, ప్రస్తుతం ఈ సంవత్సరం 149 మందికి వివిధ గ్రామాలకు చెందిన దళిత విద్యార్థులు చదువుకుంటున్నారు. వేసవి సెలవులో సెలవులు త్వరలో రానున్నాయి. ఈ వేసవి సెలవులోనైనా వసతి గృహాన్ని మరమ్మత్తులు పనులు వెంటనే చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజాసంఘాల నాయకులు నారాయణపేట జిల్లా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. వెంకటేష్ కోరుతున్నారు. గతంలో పలుసార్లు పార్టీ ఆధ్వర్యంలో వసతి గృహాన్ని పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ధన్వాడ మండల ప్రజలు కూడా వచ్చే విద్యా సంవత్సరం కైనా వసతిగృహాన్ని మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పార్లమెంటు సభ్యులు డీకే అరుణమ్మ, మరియు నారాయణపేట నియోజకవర్గం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికమ్మ కూడా పుట్టిన గ్రామం ధన్వాడనే అయిన వారి సొంత గ్రామంలో ఇలాంటి సమస్యలు వారికి కనిపించవా అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజాసంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. హాస్టల్ విద్యార్థులు కనీస సౌకర్యాలు కూడా అరకొరగా ఉన్నాయి. విద్యార్థులు స్నానాలు చేసే గదులు కూడా తలుపులు సక్రమంగా లేక ఓడిపోతున్నాయి మరుగుదొడ్ల పరిస్థితి కూడా అలాగే ఉంది అని చర్చించుకుంటున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ హాస్టల్ భవనాన్ని తగిన మరమ్మత్తులు చేపట్టి బాలుర బాలుర హాస్టల్ అసౌకర్యం నుండి కాపాడాలని ధన్వాడ మండల ప్రజలు ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News