నేటి సాక్షి,నారాయణపేట, అక్టోబర్ 14,నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో 69వ పాఠశాలల జిల్లాస్థాయి అండర్ 14 కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. కబడ్డీ పోటీలలో గెలుపొందిన వారికి సూర్యచంద్ర ఫౌండేషన్ అధినేత కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సూర్య మోహన్ రెడ్డి గారు సూర్యచంద్ర ఫౌండేషన్ తరపున మనీ ప్రైస్ ఇవ్వడం జరిగింది. మొదటి బహుమతి 3016 రెండో బహుమతి 2016 అల గర్ల్స్ టీం కి రెండు ప్రైజులు బాయ్స్ టీమ్ కు రెండు రైతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరికల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరీష్ కుమార్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు జి చెన్నయ్య,టైసన్ రఘు, రఘుపతి రెడ్డి, జంగిడి రవి ఫయాజ్ జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ, నారాయణపేట జిల్లా కేంద్రంలోని వివిధ మండలాల వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.





