నేటి సాక్షి 04 పాములపాడు :— భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం నగరంలో జనవరి 18న జరిగే లక్షలాదిమంది బహిరంగ సభను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.. రమేష్ బాబు తాలూకా కార్యదర్శి టి ప్రతాపులు పిలుపునిచ్చారు.. ఆదివారం బానకచర్ల గ్రామ శాఖ సమావేశం నాగేంద్ర అధ్యక్షతన జరిగింది ముందుగా శాఖ కార్యదర్శి ఏసేపు జండావిష్కరణ చేశారు.అనంతరం ముఖ్య అతిథులుగా పాల్గొన్న రమేష్ బాబు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం అనేకమంది అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో ఏర్పడిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని అనేక పోరాటాలు త్యాగాలు నిర్బంధాలు ఎదుర్కొని బ్రిటిష్ వారిని ఈ దేశం నుంచి తరిమికొట్టిన చరిత్ర ఒక సీపీఐకే ఉందన్నారు. నుండి నేటి వరకు పేద ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తూ పేద ప్రజలకు అండగా తెలంగాణ సాయుధ పోరాటంలో లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచిన చరిత్ర సిపిఐదేరన్నారు.. వంద సంవత్సరాలుగా రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం పేదలకు కూడుగూడు విద్య వైద్యం అందాలని అనేక పోరాటాలు నిర్వహిస్తూ నేడు అశేష త్యాగాలతో ఖమ్మంలో లక్షలాదిమంది పాల్గొనే బహిరంగ సభ జరుగుతుందని అందులో ప్రపంచ దేశాల నుండి ప్రతినిధులు పాల్గొంటున్నారని ఈ బహిరంగ సభ విజయవంతం కోసం కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో శాఖ సమితి సభ్యులు పాల్గొన్నారు..

