Saturday, March 21, 2026

*పేదలకు ఆరోగ్య భద్రతకు అండగా సీఎంఆర్ఎఫ్* * 63 మందికి రూ.30 లక్షల చెక్కులు అందించిన ఎమ్మెల్యే ఏలూరి* టీడీపీ నేత గళ్ళ రామచంద్రరావుతో కలిసి పంపిణీ* ఇప్పటి వరకు 14 నెలల్లో రూ.10,40,28,859 కోట్లు * వైసిపి హయాంలో పేదలకు ఆరోగ్య భద్రత కరువు * వైసిపి కుటుంబాలకు దక్కని సీఎం సహాయనిది ఎమ్మెల్యే ఏలూరి

నేటి సాక్షి,బాపట్ల జిల్లా (పర్చూరు)పేదలకు చికిత్స అనే మాట బరువయ్యే ఈ రోజుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం రిలీఫ్ ఫండ్ ) భారీ ఆదరణగా నిలుస్తోందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, గుంటూరు టీడీపీ సీనియర్ నేత గళ్ల రామచంద్రరావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఏలూరి సిఫారసు మేరకు మంజూరైన 63 మంది లబ్ధిదారులకు రూ.30 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను గళ్ల రామచంద్రరావుతో కలిసి ఎమ్మెల్యే ఏలూరి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. సంక్షేమం పైనే ప్రధాన దృష్టి పెట్టిన ప్రభుత్వం, వైద్యం కోసం ఇబ్బంది పడే కుటుంబాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గతంలో 2014 – 19 కాలంలో 10 కోట్ల సీఎం సహాయనిధి అందిస్తే ఈ 14 నెలల్లో రూ.10,40,28,859 విలువైన సీఎంఆర్ఎఫ్ సహాయం అందించటం ప్రభుత్వ సంక్షేమానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతి మనిషి ప్రాణం విలువైనదని ,డబ్బు లేక చికిత్స ఆగిపోవడం మా ప్రభుత్వం అసలు సహించదన్నారు. అత్యవసర ఆరోగ్య సేవలు అందించడంలో సీఎంఆర్ఎఫ్ అమూల్యమైన పాత్ర పోషిస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.*వైసీపీ హయాంలో పేదలకు ఆరోగ్య భద్రత కరువు*ఆరోగ్య భద్రత అందరికీ చేరాలనే ప్రభుత్వ ధ్యేయం అని, వైసీపీ పాలనలో సీఎంఆర్ఎఫ్ నిరాదరణకు గురైందన్నారు. వైద్యం ఖర్చులను భరించలేని పేదల కోసం కీలకంగా ఉపయోగపడే ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) గత ప్రభుత్వ కాలంలో ప్రజలకు అందుబాటులో లేకపోవడం, కనీసం వైసిపి కార్యకర్తలకు సైతం సీఎంఆర్ ఎఫ్ అందించలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం పని చేసిందన్నారు.వైద్య చికిత్స కోసం నెలల తరబడి ఎదురు చూసిన వృద్ధులు, అత్యవసర శస్త్రచికిత్సలకు డబ్బులు లేక ఇబ్బంది పడ్డ కుటుంబాలు అనేకం అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తాటి నాగేశ్వరరావు శ్రీహరి, శ్రీహరి, నాయుడు హనుమంతరావు, రంగయ్య చౌదరి, శంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News