నేటి సాక్షి, బాపట్ల జిల్లా ప్రతినిధి (పర్చూరు)ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సారధ్యంలో శనివారం ఏలూరి క్యాంపు కార్యాలయం నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. లక్ష మందికి కంటి చూపు లక్ష్యంగాఏలూరు చారిటబుల్ ట్రస్ట్, నోవా అగ్రి గ్రూప్ లిమిటెడ్, గ్రీన్ స్పార్క్ ఫౌండేషన్ మరియు శంకర కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తొలిత ఎమ్మెల్యే ఏలూరి ఏంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి, ఏలూరి నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా మహిళలకు పురుషులకు వేరువేరుగా బీపీ షుగర్ రక్తపరీక్షలు నిర్వహించారు. అనంతరం కంటి వైద్య పరీక్షలు చేశారు. మొత్తం 300 మంది హాజరు కాగా 120 మందికి శస్త్ర చికిత్సలకు వైద్యులు రిఫర్ చేశారు. శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం పాల్గొని గ్రామస్తులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ అధికారం ఎన్నికలతో సంబంధం లేకుండా గత 14 ఏళ్లుగా నిరాటంకంగా ఒక యజ్ఞంలా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా ఉపయోగలకు సేవ చేయాలనే లక్ష్యంతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. పేదలకు కంటి వైద్యం అందించి కోట్లాది రూపాయలను ఆదా చేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఎలాంటి విభేదాలు లేకుండా సమ ప్రాధాన్యతనిస్తూ వైద్యం అందిస్తున్నట్లుచెప్పారు. వేలాది కుటుంబాలలో వెలుగులు నింపామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. శంకర్ కంటి ఆసుపత్రి సేవలు అమోఘం అన్నారు. గతంలో రోజుకి 150 మందికి మాత్రమే శస్త్ర చికిత్సలు నిర్వహించేవారని తాజాగా శంకర్ కంటి ఆసుపత్రి లో నూతన బ్లాకు ఏర్పాటు చేసి ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు 300 మందికి ఆపరేషన్లు చేసేలా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో కంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు నాణ్యమైన చికిత్స అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే ఏలూరి అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుంజి వెంకట్రావు, సీనియర్ నాయకులు ఆదినారాయణ రంగయ్య తాటి నాగేశ్వరరావు తిరుమల శెట్టి శ్రీహరి, శంషుద్దీన్, జనార్ధన్, రజాక్ ఫారుక్ , సీతయ్య,తారక రామారావు ,సాంబయ్య, సురేష్ ,బాబు నాయక్, తదితరులు పాల్గొన్నారు.





