Wednesday, January 21, 2026

*పేదల అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్**పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా ఐక్యమత్యంగా పని చేయాలి**మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్* రంగారెడ్డి జిల్లా

నేటి సాక్షి ప్రతినిధి చేవెళ్ల న్యూస్ *నవాపేట్ మండలంలోని పలు గ్రామాల సర్పంచులకు సన్మానం*పేదల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, చేవెళ్ల మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం చేవెళ్ల మండలకేద్రంలో కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… దేశ సేవలో 141 ఏళ్లు పూర్తిచేసుకుని కాంగ్రెస్ పార్టీ.. అదే స్ఫూర్తితో ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుంది అని 141ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, పేదల సంక్షేమమే ధ్యేయంగా పార్టీ ముందుకు సాగుతుందన్నారు. ఎంతో మందిని నాయకులను చేసి ఉన్నత స్థానాల్లో నిలబెట్టిందన్నారు. దేశ అభివృద్ధి, ప్రజాసంక్షేమంలో ఎప్పుడూ ముందుండే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా ఐక్యమత్యంగా పని చేయాలన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం,ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం నవా పేట్ సర్పంచుల సంఘం అధ్యక్షులు దాదాపూర్ సర్పంచ్ బల్వంత్ రెడ్డిగారిని,నాగి రెడ్డిపల్లి సర్పంచ్ శేఖర్, మీనపల్లి కాలన్ సర్పంచ్ రమేష్, మాదిరెడ్డిపల్లి సర్పంచ్ గోపాల్ తదితర గ్రామాల సర్పంచులను శాలువతో సన్మానించి అభినందించారు.ఈకార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాండు యాదవ్, చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గుండాల రాములు, డిసిసి ఉపాధ్యక్షులు పడాల రాములు,పల్గుట్ట మాజీ సర్పంచ్ నర్సిములు, చేవెళ్ల మాజీ ఉపసర్పంచ్ గంగి యాదయ్య, చేవెళ్ల మార్కెట్ కమిటీ డైరెక్టర్ జనార్దన్ నాయకులు K శేఖర్ రెడ్డి, B మల్లారెడ్డి,ch ప్రభాకర్,ఉరెళ్ల యాదయ్య, మైనార్టీ నాయకులు md చాన్ పాషా, లియా కత్,బురాన్ సురేష్ రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News