నేటి సాక్షి, బాపట్ల జిల్లా (ఛందోలు)ఆపద అంటేనే ప్రతి ఒక్కరినీ ఆదు కోవటమే నిజామ్ నైజంచందోలు గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ తాను నమ్మిన సిద్ధాంతాలకు రూపు తెస్తున్న వ్యక్తిగా నిజామ్ ఘన కీర్తిని పొందుతున్నారు.దీనిలో భాగం గానే చందోలు గ్రామంలో రసూల్ పేటకు చెందిన ఒక కష్టజీవి అయిన ఖ లీల్ తన కుమార్తె కు వివాహం చేయటానికి నిర్ణయం తీసుకున్నారు.విషయం తన కు తెలియగానే నిజామ్ ఆ కుటుంబానికి తన వంతు సాయంగా స్నేహితులతో కలసి ఆర్ధిక సాయం అందించారు. దీనితో పెళ్లి కుటుంబం ఆనందంతో నిజామ్ను అభినందించారు. ఈ సందర్భంగా నిజామ్ మాట్లాడుతూ అందరూ సుఖంగా, ఆకలి లేకుండా ఉండటానికి తన శక్తి మేర కృషి అందిస్తూ ఉంటామన్నారు. అంతే కాకుండా తన రాజకీయ గురువు అయిన శాసన సభ్యులు వేగేసిన నరేంద్ర ఆదర్శంగా ఇలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము అన్నారు.అంతే కాకుండా మేము చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్కరి కి ఆదర్శం అయి సేవభావం పెంపొందలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరిఫ్, ఖాదర్, జమీల్, సైదా, సలాం, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.





