నేటి సాక్షి,బాపట్ల జిల్లా ప్రతినిధి (అద్దంకి)పేదల వైద్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. చిలకలూరిపేట లోని క్యాంప్ కార్యాలయంలో 43 మంది లబ్ధిదారులకు శనివారం నాడు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను మంత్రి గొట్టిపాటి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎంఆర్ఎఫ్ కింద కోట్లాది రూపాయిలతో పేదల జీవితాలకు అండగా నిలిచిందని అన్నారు. దీంతో సామాన్యులు కూడా నాణ్యమైన కార్పొరేట్ వైద్యాన్ని పొందగలుగుతున్నారని తెలిపారు. దీనితో పాటు కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైద్య సేవలను మరింత విస్తృతం చేస్తోందని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు మారుమూల చిన్న గ్రామాలలోనూ సబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అన్ని వ్యవస్థలతో పాటు వైద్య వ్యవస్థనూ గత వైసీపీ పాలకులు భ్రష్టు పట్టించారని ఈ సందర్భంగా మంత్రి విమర్శించారు. *మంత్రికి పుష్పగుచ్చాలు ఇచ్చిన విద్యార్థినులు….*అద్దంకి నియోజకవర్గంలోని ఉన్నత పాఠశాల, ఇంటర్ విద్యార్థులకు వేలాది సైకిళ్లను దాతల సహాయంతో ఉచితంగా అందిస్తున్న మంత్రి గొట్టిపాటికి విద్యార్థుల సర్ ప్రైజ్ ఇచ్చారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు శనివారం పంపిణీ చేసి నియోజకవర్గంలో పలు పరామర్శలకు వెళ్తున్న సమయంలో మంత్రి వాహనాన్ని మార్గ మధ్యంలో విద్యార్థులు నిలిపి… కొందరు విద్యార్థినిలు మంత్రికి పుష్పాలను అందించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దూరాభారంతో పాటు సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో కొన్ని సార్లు తరగతులకు గైర్హాజరవుతున్నామని, సైకిళ్లు అందుబాటులోకి రావడంతో తమ హాజరు శాతంతో పాటు మార్కులు కూడా మెరుగయ్యాయని మంత్రి గొట్టిపాటికి వివరించారు. దీనితో మంత్రి గొట్టిపాటి కూడా సదరు విద్యార్థులను అభినందించారు. కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు వెళ్లాలని వారిని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు..





