నేటి సాక్షి, బాపట్ల జిల్లా (ఛందో లు)చందోలు గ్రామంలోని జుల్ఫా లాంఫా వీధిలో ఎం డి హనీఫ్ అనే వ్యక్తి దర్జీ(టైలర్) వృత్తి చేస్తూజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో జీవనం సాగిస్తూ కుటుంబ అవసరాల కోసం పనిచేస్తూ పేదరికంలో ఉన్నారు. ఈ సమయం లో మొన్న కురిసిన తుఫాన్ ప్రభావం తో ఇల్లు కూడా నీళ్ల తో నిండి ఇబ్బందులకు గురి అయ్యారు. విషయం తెలుసుకున్న టీడీపీ యువనాయకులు నిజామ్ ఈ రోజు ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి కి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆకలి తో బాధపడ కుండ కడుపు నింపుకోవాలి అని నిజామ్ ఆశించి సాయం అందించారు. ఈ సందర్భంగా నిజామ్ మాట్లాడుతూ తన రాజకీయ గురువు అయిన శాసన సభ్యులు వేగేసిన నరేంద్రవర్మ రాజు చేసే సేవలు, ఆయన స్ఫూర్తి తో ఇలా సాయం చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ కె బాజి, అమీర,ఎం డి సైదా పాల్గొన్నారు.





